శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 29 సెప్టెంబరు 2016 (19:41 IST)

పాక్ పైన ఒకేసారి రెండుదేశాలు దాడి, 1. భారత్, 2. ఇరాన్, పాక్ శవాసనం...

పాకిస్తాన్ దేశం ఉగ్రవాదులను వెన్ను కాస్తున్నందుకు మూల్యం చెల్లించుకుంటోంది. ఇప్పటికే భారతదేశం సైనిక దాడి చేసి పాకిస్తాన్ ను షాక్ కు గురి చేస్తే, దీనికి మించిన మైండ్ బ్లాంక్ అయ్యే ఘటన ఒకటి జరిగింది. అదేమిటంటే... సరిగ్గా నిన్న రాత్రే పాక్ పొరుగు దేశమైన

పాకిస్తాన్ దేశం ఉగ్రవాదులను వెన్ను కాస్తున్నందుకు మూల్యం చెల్లించుకుంటోంది. ఇప్పటికే భారతదేశం సైనిక దాడి చేసి పాకిస్తాన్ ను షాక్ కు గురి చేస్తే, దీనికి మించిన మైండ్ బ్లాంక్ అయ్యే ఘటన ఒకటి జరిగింది. అదేమిటంటే... సరిగ్గా నిన్న రాత్రే పాక్ పొరుగు దేశమైన ఇరాన్ కూడా పాకిస్తాన్ పైన దాడి చేసింది. మన దేశం సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే, ఇరాన్ మోర్టార్లతో విరుచుకుపడింది. మిత్ర దేశంగా ఉంటూనే ఇలా అకస్మాత్తుగా తమపై ఇరాన్ ఎందుకు దాడి చేసిందో తెలియక పాకిస్తాన్ జుట్టు పీక్కుంటోంది. 
 
పాకిస్తాన్‌కు మన దేశంతో పాటు నాలుగు దేశాలు పొరుగున ఉన్నాయి. వీటిలో మన దేశంతోపాటు ఆఫ్ఘనిస్తాన్ దానికి శత్రువులు. ఇరాన్ దేశం మాత్రం మిత్రదేశంగా ఉంటూ వస్తోంది. ముఖ్యంగా బలూచిస్తాన్ రెబల్స్ కారణంగా ఇరాన్ పాకిస్తాన్ దేశంతో మిత్రత్వం సాగిస్తోంది. కానీ హఠాత్తుగా ఆ దేశం పాకిస్తాన్ పైన దాడి చేయడంతో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అంతుచిక్కక అయమోయంలో పడిపోయారు. కారణాలు ఏమిటో తెలుసుకునే పనిలో పడ్డారు పాక్ పెద్దలు.