Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రపంచ అభివృద్ధికి భారత్ - అమెరికాలు రెండు రథచక్రాలు : ప్రధాని మోడీ

మంగళవారం, 27 జూన్ 2017 (09:40 IST)

Widgets Magazine
narendra modi

ప్రపంచ అభివృద్ధికి భారత్, అమెరికా దేశాలు రెండు రథచక్రాలు వంటివని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో సమావేశమయ్యారు. నేటి ప్రపంచాన్ని నడిపిస్తున్న శక్తులు అమెరికా, భారత్‌ మాత్రమేనని వ్యాఖ్యానించారు. తాను, ట్రంప్‌ అభివృద్ధి యంత్రాలమన్నారు. తన ఈ పర్యటన ద్వారా అమెరికాతో భారత్‌ బంధం మరింత బలపడిందన్నారు. 
 
అమెరికా అధినేత ట్రంప్‌, ఆ దేశ అధికార బృందంతో వైట్‌హౌస్‌లో వివిధ స్థాయుల సమావేశం తర్వాత అక్కడి రోజ్ గార్డెన్‌లో ట్రంప్, మోడీలు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. భారత్, అమెరికా మధ్య మరింత బలమైన సంబంధాల దిశగా విస్తృతమైన చర్చలు జరిగాయన్నారు. ఇందులో వాణిజ్యం, పెట్టుబడులు ప్రధానాంశాలు కాగా, సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలు, ఆర్థిక అంశాలు కూడా కీలకంగా ఉన్నాయన్నారు. 
 
అధ్యక్షుడు ట్రంప్ విజన్ అయిన 'మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్'... తన విజన్ అయిన 'న్యూ ఇండియా' ఒక సమాహారంగా ఉంటాయన్నారు. పరస్పర విశ్వాసం ఆధారంగా సాగిన నేటి తమ చర్చలు అత్యంత ముఖ్యమైనవన్నారు. ఇక ఉగ్రవాదం విసురుతున్న సవాళ్ళపై తమ సంయుక్త పోరాటం ముఖ్యమైన అంశంగా ఉంటుందన్నారు. చివరిగా ట్రంప్ కుటుంబాన్ని భారత పర్యటనకు రావలసిందిగా ఆహ్వానించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

తల్లిదండ్రులు తిట్టారని ఇంటి నుంచి వచ్చేసింది: ఉత్తుత్తి పెళ్ళి చేసుకున్నాడు.. అత్యాచారం చేశాడు..

తల్లిదండ్రులు తిట్టారనే కోపంతో ఇంటి నుంచి పారిపోయి వచ్చిన 17 ఏళ్ల అమ్మాయిపై ఓ ఆలయ పూజారి ...

news

అంతర్జాతీయ ఉగ్రవాదిగా సయ్యద్ సలావుద్దీన్ : అమెరికా ప్రకటన

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈయన పర్యటనకు ముందు అమెరికా ...

news

రైలు టాయ్‌లెట్‌లో మహిళ.. వెంటిలేటర్ నుంచి మొబైల్‌లో వీడియో చిత్రీకరణ

రైలు ప్రయాణికులకు రక్షణగా ఉండాల్సిన ఓ రైల్వే ఉద్యోగి పాడుపనికి పాల్పడ్డాడు. రైలు ...

news

తలుపు సందులోంచి చూసినప్పుడు శిరీషను ఎస్సై అత్యాచారయత్నం చేస్తున్నట్లు కనిపించింది..

హైదరాబాద్ ఆర్జే స్టూడియోలో ఆత్మహత్యకు పాల్పడిన శిరీష కేసులో చిక్కుముడులు వీడుతున్నట్లు ...

Widgets Magazine