Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఫెడరల్ కోర్టులో ట్రంప్‌కు చుక్కెదురు.. ఇమ్మిగ్రేషన్ బ్యాన్‌‍‌ నిలిపివేత.. స్టే కోసం మల్లగుల్లాలు

శనివారం, 4 ఫిబ్రవరి 2017 (15:24 IST)

Widgets Magazine

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై న్యాయ వ్యవస్థ గుర్రుగా ఉంది. ట్రంప్ విధానాలకు న్యాయవ్యవస్థల మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో ఏడు ముస్లి ఆధిక్య దేశాల వారు అమెరికాలోకి ప్రవేశించకుండా విధించిన నిషేధాన్ని అమెరికాలోని ఓ ఫెడరల్ కోర్టు దేశవ్యాప్తంగా నిలిపివేసింది. 
 
అధ్యక్షుడి ఆదేశాలను అమెరికా రాష్ట్రాలు ప్రశ్నించలేవన్న ప్రభుత్వం న్యాయవాదుల వాదనలతో ఫెడరల్‌ జడ్జి జేమ్స్‌ రాబర్ట్స్‌ విభేదిస్తూ ఈ ఉత్తర్వులను జారీ చేశారు. దీంతో న్యాయమూర్తి ట్రంప్ ఆదేశాలను నిలిపివేయటంపై స్టే కోరాలని న్యాయ విభాగం భావిస్తోంది. ఇంకా దీనిపై చట్టబద్ధంగా, న్యాయమార్గంలో వెళ్లాలని ట్రంప్ సూచించినట్లు వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. 
 
ఇదిలా ఉంటే.. గత వారం ట్రంప్‌ జారీ చేసిన ఎగ్జిక్యూటీవ్‌ ఆర్డర్ల కారణంగా అమెరికా విమానాశ్రయాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. దాదాపు 60,000 వీసాలను అధికారులు రద్దు చేశారు. ఇంకా ఏడు ముస్లిం ఆధిక్య దేశాల నుంచి వలసదారులు అమెరికాలోకి ప్రవేశించకుండా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను వ్యతిరేకిస్తూ వాషింగ్టన్‌ రాష్ట్రం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అమెరికాలో అంతర్యుద్ధం తప్పదా? ట్రంప్ వద్దు, ఒబామా కావాలంటున్న అమెరికన్స్

అమెరికాలో రోజురోజుకీ నూతన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పైన విపరీతంగా వ్యతిరేకత ...

news

ప్రేయసి మోసం చేసింది.. జీవితంపై విరక్తి.. టెక్కీ ఆత్మహత్య.. నిద్రొస్తుందని బెడ్‌రూమ్‌లోకి వెళ్లి?

గత వారం పూణేలోని ఇన్ఫోసిస్‌లో పని చేస్తున్న లేడీ టెక్కీ రసిలా రాజు (24) ఆమె పని చేస్తున్న ...

news

ఫేస్ బుక్ పరిచయం... ప్రియుడికోసం లేచి వచ్చేసింది... పెళ్లితో ఆ సుఖం తీర్చుకుని పాతేశాడు...

ప్రేమ పేరుతో వంచించాడు. ప్రేమిస్తున్నానని చెప్పడంతో నమ్మి వచ్చిన మహిళను అత్యంత కిరాతకంగా ...

news

అరుదైన హెర్నియా ఆపరేషన్.. పురుషుని కడుపులో స్త్రీ జననాంగాలు, గర్భసంచి..!

నెల్లూరులోని ప్రభుత్వ వైద్యశాలలో వైద్య నిపుణులు గురువారం అరుదైన శస్త్రచికిత్స జరిగింది. ...

Widgets Magazine