శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 31 జులై 2015 (12:59 IST)

ఐఎస్ఐఎస్‌ చేతిలో చిక్కుకున్న భారతీయులు: వీరిలో ఇద్దరు తెలుగు వారు కూడా..?

భారతీయులంతా లిబియా విడిచి రావాలని గత సంవత్సరమే కేంద్ర ప్రభుత్వం సూచించినప్పటికీ, ఇంకా వందల సంఖ్యలో భారతీయులు అక్కడే ఉండటం కొంప ముంచింది. లిబియాలో ట్రిపోలీలో టీచర్స్‌గా పనిచేస్తున్న వారిని ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులు అపహరించారు. వీరిలో నలుగురు భారతీయులుండగా, మరో ఇద్దరు తెలుగువారు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కిడ్నాపైన వారిలో తెలుగువారైన హైదరాబాదుకు చెందిన గోపీకృష్ణ, శ్రీకాకుళానికి చెందిన బలరాం ఉన్నట్టు విదేశాంగ శాఖ ప్రకటించింది. 
 
మిగతావారిలో ఒకరు రాయచూరు, మరొకరు బెంగళూరు ప్రాంతాలకు చెందిన వారని, వీరిలో ముగ్గురు యూనివర్శిటీ ఆఫ్ సిథ్‌లో ఫ్యాకల్టీ సభ్యులుగా ఉన్నారని, మరొకరు జుఫ్రాలోని వర్శిటీ శాఖలో పనిచేస్తున్నారని విదేశాంగ శాఖ ప్రతినిధులు తెలిపారు. వీరంతా ఇండియాకు తిరిగొచ్చే నిమిత్తం విమానాశ్రయానికి వెళుతుంటే, ఓ చెక్ పోస్టు వద్ద పట్టుకొని కిడ్నాప్ చేశారని పేర్కొన్నారు. వీరి ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని... వీరిని అపహరించడం వెనుక ఉగ్రవాదుల ఉద్దేశమేమిటో కూడా తెలియదని విదేశాంగ శాఖ ప్రతినిధులు వెల్లడించారు.