శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 21 ఆగస్టు 2014 (15:24 IST)

'ఐస్ బకెట్ ఛాలెంజ్' ఓ వైరల్ ఫీవర్‌: జార్జ్ బుష్ సవాల్! (వీడియో)

'ఐస్ బకెట్ ఛాలెంజ్' ప్రపంచవ్యాప్తంగా ఓ వైరల్ ఫీవర్‌లా ప్రముఖులను వెంటాడుతోంది. ఎవరైనా ఐస్ నీళ్లతో స్నానం చేసి.. మరికొంతమందికి ఛాలెంజ్‌ను విసరడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
 
తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ కూడా ఈ ఛాలెంజ్‌లో భాగస్వామి అయ్యారు. నేవి బ్లూ క్రూనెక్ టీషర్టు ధరించిన బుష్.. ఐస్ వాటర్ బకెట్‌ను తన మీద కుమ్మరించుకున్నారు. 
 
మరో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు బుష్ ఛాలెంజ్ విసిరారు. అంతేకాకుండా తన కూతురు జెన్నా బుష్ హెగర్‌ను ఈ ఛాలెంజ్‌కు నామినేట్ చేశారు. ఐస్ వాటర్ స్నానం చేసిన బుష్ నిధి కోసం ఓ చెక్ కూడా రాశారు. 
 
లా గెరిగ్స్ వ్యాధితో బాధపడుతున్న వారికి సహాయం అందించేందుకు ఏర్పాటు చేసిన నిధి కోసం అమెరికాలో ఐస్ బకెట్ ఛాలెంజ్‌ను ప్రారంభించారు.