శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 17 ఏప్రియల్ 2015 (19:25 IST)

సోషల్ మీడియాలో ఉగ్రసింహం హల్‌చల్! చుట్టేస్తున్న ఆ ఫోటోని..?

ఉగ్రరూపంలో ఉన్న ఓ సింహం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్‌ స్టాగ్రాం, వాట్సప్ అని తేడా లేకుండా సోషల్ మీడియాను ఆ ఉగ్ర సింహం చుట్టేస్తోంది. స్తంభాన్ని పగులగొట్టుకుని వచ్చిన ఉగ్రనరసింహుని నకలు రూపంలా కనబడుతున్న ఆ సింహం ఫోటోని ప్రాణాలకు తెగించి అతీఫ్ సయీద్ అనే పాకిస్థాన్ ఫోటోగ్రాఫర్ తీశాడు. 
 
2012లో అతీఫ్ సయీద్ లాహోర్ జూను సందర్శించిన సందర్భంగా ఆగ్రహంతో ఊగిపోతున్న ఆ సింహం కళ్లలో కెమేరా కన్ను పెట్టాడు. ఉగ్రనరసింహుని కళ్లకు కట్టినట్టు కనబడుతున్న ఆ ఫోటోని ఈ మధ్యే సోషల్ మీడియాలో అతీఫ్ పోస్టు చేశాడు. అంతే దానిని సోషల్ మీడియాలోని వీక్షకులు లైకులు, షేర్లతో అభిమానిస్తున్నారు.