శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 29 జులై 2016 (11:15 IST)

ఇండోనేషియాలో భారతీయుడికి మరణశిక్ష.. రక్షించేందుకు కేంద్రం యత్నాలు

అక్రమ మాదకద్రవ్యాల కేసులో దోషిగా తేలిన ఓ భారతీయుడికి ఇండోనేషియా కోర్టు ఉరిశిక్ష విధించింది. ప్రస్తుతం ఈ దోషిని రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ దోషి పేరు గుర్‌దీవ్ సింగ్.

అక్రమ మాదకద్రవ్యాల కేసులో దోషిగా తేలిన ఓ భారతీయుడికి ఇండోనేషియా కోర్టు ఉరిశిక్ష విధించింది. ప్రస్తుతం ఈ దోషిని రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ దోషి పేరు గుర్‌దీవ్ సింగ్. 
 
ఈయన 2004లో గుర్‌దీప్ 300 గ్రాముల హెరాయిన్‌తో జకార్తా అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుబడ్డాడు. డ్రగ్స్ కేసులో సింగ్, ఓ మహిళ సహా మొత్తం 14 మందికి అక్కడి ప్రభుత్వం మరణశిక్ష విధించింది. విషయం తెలిసిన భారత ప్రభుత్వం గుర్‌దీప్‌ను రక్షించేందుకు చర్యలు చేపట్టింది. 
 
సింగ్‌కు క్షమాభిక్ష ప్రసాదించాలని కోరుతూ ఇండోనేషియా అధ్యక్షుడి వద్ద పిటిషన్ దాఖలు చేసింది. ఇండోనేషియాలోని తమ దౌత్య అధికారులు అక్కడి అధికారులతో టచ్‌లో ఉన్నారని, అలాగే గుర్‌దీప్ భార్య, సోదరులను కలిసి మాట్లాడుతున్నారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు.