శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 21 జులై 2015 (13:09 IST)

ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కుతున్న గ్రీస్.. ప్రజలపై భారం...

గ్రీస్ దేశం ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కనుంది. అంతర్జాతీయ సమాజంలో దృష్టిని చెడ్డపేరు తెచ్చుకోకుండా ఉండేందుకు వీలుగా కఠిన నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగేందుకు సిద్ధమైంది. ఇందులోభాగంగా ప్రజలపై భారీగా భారం మోపనుంది. గ్రీస్ సర్కారు అంగీకరించి విలువ ఆధారిత పన్నులను ప్రస్తుతమున్న 13 శాతం నుంచి ఏకంగా 23 శాతానికి పెంచింది. దీంతో ప్రజల నుంచి వచ్చే విమర్శలు ఎలాగున్నా, ఖజానాకు నిధులు సమకూరే మార్గం దగ్గరైంది. 
 
ప్రజా రవాణా వ్యవస్థ నుంచి ఆహార పదార్థాల వరకూ ధరలు పెరిగాయి. గ్రీస్ ప్రజల్లో అత్యధికులు ఈ సంస్కరణలకు 'నో' చెప్పినప్పటికీ, ప్రపంచం ముందు చెడ్డపేరు తెచ్చుకోకూడదన్న ఉద్దేశంతో కఠిన నిర్ణయాల అమలుకే గ్రీస్ ప్రధాని అలెక్సిస్ మొగ్గు చూపారు. అలాగే, గతంలో తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించే పని మొదలు పెట్టింది. మూడు వారాల తర్వాత బ్యాంకులను తెరిపించింది. 
 
గతవారం ఉద్దీపన సంస్కరణల కొత్త ప్యాకేజీకి ఓకే చెప్పిన గ్రీస్, 2 బిలియన్ యూరోలు (సుమారు రూ. 13,600 కోట్లు) రుణ దాతలకు తిరిగి చెల్లించింది. ప్రజలపై పన్నుల భారం మోపేందుకు బ్యాంకులు తెరచుకోగానే వేలాది మంది డబ్బు డ్రా చేసుకునేందుకు క్యూలు కట్టారు. వారానికి కేవలం 420 యూరోలను మాత్రమే బ్యాంకుల నుంచి విత్ డ్రా చేసుకోవాలన్నారు.