శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : బుధవారం, 29 జులై 2015 (09:13 IST)

కోహినూర్... భారతదేశానికి చెందినదే...! మోదీకి ఇచ్చి పంపండి...!! బ్రిటన్ ఎంపి వినతి

భారతదేశం నుంచి కోహినూర్ వజ్రాన్ని అప్పట్లో బ్రిటీష్ పాలకులు తీసుకువచ్చారు. దానిని తిరిగి ఆ దేశానికి ఇచ్చేయడం న్యాయం.. వారి సంపదను వారికిచ్చి మన దేశ గౌరవాన్ని నిలుపుకోవాలని బ్రిటన్‌కు చెందిన ఓ ఎంపి ఆ దేశ ప్రభుత్వానికి విన్నివించారు. మోదీ రాక సందర్భంగా దానిని అప్పగించి భారతదేశంతో మంచి సంబంధాలను ఏర్పచుకోవాలని ఆయన అక్కడి ప్రభుత్వాన్ని కోరారు. వివరాలిలా ఉన్నాయి.
 
బ్రిటిష్ పాలకులు వెళుతూ.. వెళుతూ..భారతదేశం నుంచి అత్యంత విలువైన ‘కోహినూర్’ వజ్రాన్ని వారి దేశానికి తీసుకెళ్ళి పోయారు. ఆ తర్వాత దశాబ్దాల పాటు ఆ వజ్రం అక్కడే ఉండిపోయింది. కోహినూర్‌ను వెనక్కు తీసుకొచ్చేందుకు భారతీయులు ప్రయత్నాలు చేశారు. అవేవి ఫలించలేదు. తాజాగా భారత సంతతికి చెందిన బ్రిటన్ ఎంపీ కీత్ వేజ్ మరోమారు ఈ తరహా యత్నానికి శ్రీకారం చుట్టారు. 
 
భారత్‌కు చెందిన కోహినూర్ వజ్రాన్ని ఆ దేశానికే ఇచ్చేయాలని కీత్ వేజ్ బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఏడాది నవంబర్‌లో బ్రిటన్ రానున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి కోహినూర్‌ను ఇచ్చి పంపాలని ఆయన కోరారు. ఎంత వరకూ సఫలమవుతుందో వేచి చూడాలి.