శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : గురువారం, 20 నవంబరు 2014 (11:29 IST)

భర్త, ప్రియుడుని హతమార్చి... మరో వ్యక్తితో యువతి ఎంజాయ్

కట్టుకున్న భర్తను, ప్రేమించిన ప్రియుడిని దారుణంగా హత్య చేసి, మరో వ్యక్తితో ఎంజాయ్ చేస్తూ, పోలీసులకు పట్టుబడి జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ఒక యువతి తన స్వియ చరిత్రను విడుదల చేసింది. 
 
ఆస్ట్రియా దేశానికి చెందిన కరన్సా ఐస్‌క్రీమ్ దుకాణం నడుపుతుంది. ఈమె 2008లో భర్తను, 2010లో ప్రియుడిని కాల్చి చంపేసింది. ఆ తర్వాత వారి ఇద్దరి మృత దేహాలను ఐస్‌క్రీమ్ దుకాణంలోనే పూడ్చిపెట్టింది. విడాకులు పొందిన తర్వాత కూడా తనకు స్వేచ్చనివ్వకుండా ఇంటికి వస్తున్నాడని భర్తను, ప్రతి రోజూ మద్యం సేవించి వస్తున్నాడని ప్రియుడిని ఆమె హతమార్చింది.
 
దుకాణంలో పని చేసే సిబ్బంది గుర్తించడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. కోర్టు ఆమెకు జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పు నిచ్చింది. ఆమె ప్రస్తుతం కోర్టులో శిక్ష పొందుతుంది. 
 
ఈ స్థితిలో ఆమె తన స్వియ చరిత్రను My Two Lives, The True Story of the Ice Lady అనే పేరుతో ఒక పుస్తకంలో రాసింది. అందులో తన భవిష్యత్ ప్రకాశవంతంగా ఉంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. 
 
అయితే కరన్సా బయటకు వచ్చినట్లైతే, అవకాశం చిక్కితే మళ్లీ ఎవరినైనా హత్య చేసేటువంటి మానశిక స్థితిలో ఉన్నట్టు వైద్యులు హెచ్చరిస్తున్నారు.