శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 7 జూన్ 2018 (10:25 IST)

పార్టీలోని మహిళలను కూడా వదలిపెట్టలేదు : ఇమ్రాన్‌పై మాజీ భార్య

పాకిస్థాన్ మాజీ క్రికెటర్, తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్‌పై ఆమె రెండో భార్య (మాజీ భార్య) రెహమ్ ఖాన్ మరోమారు సంచలన ఆరోపణలు చేసింది. ఇమ్రాన్ ఖాన్.. పార్టీలోని మహిళలను కూడా వదిలిపెట్టలేదన

పాకిస్థాన్ మాజీ క్రికెటర్, తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్‌పై ఆమె రెండో భార్య (మాజీ భార్య) రెహమ్ ఖాన్ మరోమారు సంచలన ఆరోపణలు చేసింది. ఇమ్రాన్ ఖాన్.. పార్టీలోని మహిళలను కూడా వదిలిపెట్టలేదనీ, వారితోనూ లైంగికానందం పొందారని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు తాను రాసిన ఓ పుస్తకంలో ఈ అంశాలను పొందుపరిచింది. ఈ పుస్తకంలోని అంశాలు ఇపుడు పాకిస్థాన్‌లో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.
 
తెహ్రీక్ ఇ ఇన్సాఫ్‌లో మహిళలపై ఇమ్రాన్ లైంగిక వేధింపులు ఉన్నాయనీ తెలిపింది. సెక్సువల్ ఫేవర్స్ చేసే మహిళలకు పార్టీలో ఉండే ప్రయోజనాలను ఆమె వివరించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ గెలిస్తే, దేశాన్ని తీవ్రవాదులకు అప్పగిస్తాడని తెలిపారు. ఇమ్రాన్ పట్ల భారత్ మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. జర్నలిస్టు అయిన రెహమ్ ఖాన్ ఇమ్రాన్ ఖాన్‌తో కేవలం 10 నెలలు మాత్రమే సంసారం చేశారు. ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు.