సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 24 మే 2018 (13:00 IST)

హఫీజ్ సయీద్‌ను ఆ దేశానికి తరలించండి.. పాక్‌కు చైనా సూచన

మొన్నటికి మొన్న రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మసీదులపై జాతీయ జెండాను ఎగిరించాలని చైనా పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా పాకిస్థాన్‌పై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమవుతోంది.

మొన్నటికి మొన్న రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మసీదులపై జాతీయ జెండాను ఎగిరించాలని చైనా పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా పాకిస్థాన్‌పై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. 


ముంబై మారణ హోమ సూత్రధారి, 2008 నవంబర్ దాడి కుట్ర నిందితుడు, జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ పై చర్యలు తీసుకోవాలంటూ పాకిస్తాన్‌పై అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిళ్లు పెరిగిపోతున్న వేళ.. హఫీజ్‌ను పశ్చిమాసియాలోని ఓ దేశానికి తరలించడం మంచిదని పాకిస్థాన్‌కు మిత్ర దేశమైన చైనా సూచించింది. 
 
ఏప్రిల్‌ మాసానా చైనాలో జరిగిన ఓ సదస్సులో భాగంగా.. పాకిస్తాన్ ప్రధాని షహీద్ ఖాన్ అబ్బాసీతో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగానే హఫీజ్ సయీద్‌ను వేరే దేశానికి తరలించాలన్న సూచనను జిన్ పింగ్ చేసినట్లు తెలుస్తోంది.

పశ్చిమాసియాలో ఓ దేశానికి తరలిస్తే అక్కడే అతని శేష జీవితం గడిచిపోతుందని జిన్ పింగ్ సూచించినట్లు సమాచారం. ఇకపోతే.. అబ్బాసీ పదవీకాలం మే నెలతో ముగిసిపోతోంది. జూలైలో సాధారణ ఎన్నికల తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వం హఫీజ్‌పై ఓ నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.