శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 30 మార్చి 2015 (14:43 IST)

యెమెన్‌లో ఉద్రిక్తత: భారతీయుల కోసం కంట్రోల్ రూమ్!

యెమెన్‌లో సౌదీ అరేబియా వైమానిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం ఓ విమానాన్ని పంపింది. 1500 మందిని తరలించే సామర్థ్యం ఉన్న నౌకను యెమెన్‌కు పంపే యోచనలో కేంద్రం ఉంది. యెమెన్‌లో పరిస్థితిని సమీక్షించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
 
వివిధ ఉద్యోగాలు, పనుల కోసం యెమెన్‌ వెళ్ళిన భారతీయులు సుమారు 3,500 మంది అక్కడ చిక్కుకున్నారు. తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా, సౌదీ అరేబియా వైమానిక దాడులు కొనసాగుతుండటంతో అక్కడ భయాందోళనలు నెలకొన్నాయి. 
 
అక్కడ చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ ఉదయం ప్రత్యేక విమానాన్ని పంపింది. దీనికి అదనంగా, 1500 మందిని తరలించే సామర్థ్యం ఉన్న రెండు నౌకలను పంపింది.