శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : సోమవారం, 25 మే 2015 (07:38 IST)

పిల్లాజెల్లా...! ఎవర్నీ వదలలేదు..!! 400 మందిని తెగనరికేశారు.

వారు ఏం చేసినా మిన్నకుండాలి. కాదూ కూడదని నోరు మెదిపితే... నరుకుడే.. లేదంటే తూట్లు తూట్లు కాల్చడమే.. ఇంత దారుణంగా ఎవరు వ్యవహరిస్తారు ఒక్క ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు తప్ప.. యస్..! మీ ఊహ నూటికి నూరుపాళ్ళు కరెక్టే.. పిల్లా జెల్లా.. ముసలిముతక.. మహిళలు, వికలాంగులనే తేడా లేకుండా వారం రోజుల్లో 400 మందిని తెగ నరికేశారు. వివరాలిలా ఉన్నాయి. 
 
నాలుగు రోజుల్లో నాలుగొందలమందిని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారని సిరియా మీడియా వర్గాలు తెలిపాయి. బుధవారం నుంచి మధ్య సిరియాలోని ప్రాచీన నగరం పాల్మిరా, మిల్లెన్నియాలో ఐఎస్ ఉగ్రవాదులు నరమేధం సృష్టించారని ఫలితంగా 400 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని వివరించాయి. చనిపోయిన వారిలో చిన్నారులు, మహిళలే ఎక్కువగా ఉన్నారని తెలిపాయి.
 
ఈ రెండు నగరాలను పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్న అనంతరం ఐఎస్ ఉగ్రవాదులు తమ అరాచకాలకు పాల్పడ్డారు. వారిని ప్రతిఘటించేందుకు ప్రయత్నించిన అమాయకులను మట్టుపెట్టుబెట్టారు. వీరిని అణిచివేసేందుకు సిరియా ప్రభుత్వం చేసిన బాంబు దాడుల కారణంగా కూడా చాలామంది బలైపోయారని మీడియా తెలిపింది. ప్రస్తుతానికి పాల్మిరా నగరమంతా పూర్తిగా ఐఎస్ చేతుల్లో చిక్కుకుని ఉందని లండన్కు చెందిన ఓ మీడియా తెలిపింది. ఈ నగరం యూనెస్కో వారసత్వ నగరాల జాబితాలో ఉంది.