శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 21 ఆగస్టు 2014 (09:25 IST)

అమెరికా జర్నలిస్ట్ సిరియాలో కిడ్నాప్.. ఇరాక్‌లో తల నరికివేత!

ఇరాక్‌పై అగ్రరాజ్యం అమెరికా చేస్తున్న వైమానిక దాడులకు నిరసనగా 2012లో సిరియాలో కిడ్నాప్ చేసిన అమెరికా జర్నలిస్టు జేమ్స్ ఫోలేను ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా హతమార్చారు. ఒక ఎడారి ప్రాంతానికి తీసుకెళ్లిన తీవ్రవాదులు.. ఫోలే తల నరికి చంపి ఆ వీడియోను యూట్యూబ్‌లో పెట్టారు. ఇరాక్‌పై అమెరికా దాడులు కొనసాగిస్తే మరో అమెరికా జర్నలిస్టును హతమారుస్తామని హెచ్చరించారు.
 
ఉగ్రవాదుల దాష్టీకాన్ని అమెరికా, బ్రిటన్ తీవ్రంగా ఖండించాయి. జిమ్‌ను కిరాతకంగా హత్యచేయడం ప్రపంచాన్ని భయకంపితం చేసిందని అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా వ్యాఖ్యానించారు. ఈ చర్యతో ఐఎస్‌ఐఎస్ మిలిటెంట్లు తమకు ఏ మతం లేదని చాటుకున్నారన్నారని, ఇకపై వారి పని పడతామని హెచ్చరించారు.