శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 8 డిశెంబరు 2017 (14:38 IST)

కుల్ భూషణ్ జాదవ్‌పై పాక్ కీలక నిర్ణయం :: కనిపిస్తే కాల్చేయండి

గూఢచర్యం కేసులో అరెస్టు జైలులో మగ్గుతున్న భారతీయుడు కుల్ భూషణ్ జాదవ్‌‌ విషయంలో పాకిస్థాన్ కీలక నిర్ణయం తీసుకుంది.

గూఢచర్యం కేసులో అరెస్టు జైలులో మగ్గుతున్న భారతీయుడు కుల్ భూషణ్ జాదవ్‌‌ విషయంలో పాకిస్థాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశ జైలులో మగ్గుతున్న జాదవ్‌ను ఈనెల 25వ తేదీ కలిసేందుకు ఆయన తల్లికి, భార్యకు పాకిస్థాన్ అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని పాకిస్థాన్ విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి డాక్టర్ మహ్మద్ ఫైజల్ వెల్లడించారు. కుల్‌భూషణ్ జాదవ్ భార్య, తల్లి ఆయనతో సమావేశమైనపుడు, వారితోపాటు భారతదేశ దౌత్య కార్యాలయం సిబ్బంది ఒకరు తోడుగా ఉంటారని తెలిపారు.
 
కాగా, జాదవ్‌ను భారతదేశ రహస్య గూఢచారి అని ఆరోపిస్తూ పాకిస్థాన్ మిలిటరీ కోర్టు ఆయనకు మరణశిక్ష విధించింది. అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)ని మన దేశం ఆశ్రయించి, శిక్ష అమలుకాకుండా అడ్డుకోగలిగింది. ఈ కేసులో అవసరమైన పత్రాలను సమర్పించేందుకు పాకిస్థాన్‌కు ఈ నెల 13వ తేదీ వరకు గడువు ఇచ్చింది. భారతదేశ వాదనలకు స్పందించాలని ఆదేశించిన విషయం తెల్సిందే. 
 
ఇదిలావుండగా, పాకిస్థాన్ గగనతలంలో ప్రవేశించే విదేశీ డ్రోన్లను కనిపించగానే కాల్చేపారెయ్యాలని ఆ దేశ వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ సొహెయిల్ అమన్ స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఇది ముఖ్యంగా అమెరికాకు హెచ్చరికగా విశ్లేషకులు పరిగణిస్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ సరిహద్దుల్లో అమెరికా డ్రోన్లను వినియోగిస్తూ ఉంటుందన్న సంగతిని గుర్తు చేస్తున్నారు. వీటిని ఉద్దేశించే ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేశారని అంతర్జాతీయ దౌత్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.