మంగళవారం, 28 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 27 నవంబరు 2017 (12:46 IST)

రస్నా గర్ల్ అంకితకు బాబు పుట్టాడు..

అంకితకు అబ్బాయి పుట్టాడు. అసలీ అంకిత ఎవరనేగా మీ డౌట్. ఆమె ఎవరో కాదు.. అదేనండీ రస్నా బేబీ.. ఎన్టీఆర్ హీరోయిన్. లాహిరి లాహిరి లాహిరిలో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పలకరించిన ఈ ముద్దుగుమ్మ ప్రేమలో పావ

అంకితకు అబ్బాయి పుట్టాడు. అసలీ అంకిత ఎవరనేగా మీ డౌట్. ఆమె ఎవరో కాదు.. అదేనండీ రస్నా బేబీ.. ఎన్టీఆర్ హీరోయిన్. లాహిరి లాహిరి లాహిరిలో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పలకరించిన ఈ ముద్దుగుమ్మ ప్రేమలో పావని కళ్యాణ్‌, ధనలక్ష్మీ ఐ లవ్‌ యూ, సింహాద్రి, విజయేంద్రవర్మ వంటి పలు చిత్రాల్లో నటించింది.

అంకిత టాలీవుడ్ టాప్ హీరోలైన జూనియర్ ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణ, మాస్ మహారాజా రవితేజతో హీరోయిన్‌గా నటించింది. 
 
ఆపై న్యూజెర్సీకి చెందిన ఎన్నారై, జెపి మోర్గాన్‌ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ అయిన విశాల్‌ జగ్తాప్‌ను వివాహం చేసుకుంది. 2016లో వీరు వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తరువాత అంకిత సినిమాలకు దూరంగా ఉంది. ఆదివారం అంకితకు పండంటి బాబు పుట్టాడని విశాల్ తెలిపారు.