శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : శుక్రవారం, 31 జులై 2015 (12:00 IST)

నలుగురు భారతీయ ఉపాధ్యాయులను అపహరించిన ఐఎస్ఐఎస్

లిబియాలోని ట్రిపోలి విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్న నలుగురు భారతీయులను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు బుధవారం అపహరించారు. ఈ మేరకు భారత ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేస్తోంది. నలుగురు భారతీయులు  ట్రిపోలీ సమీపంలో అపరణకు గురయ్యారని తెలుస్తోంది. 
 
అక్కడి యూనివర్శిటీలో వారు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారని అధికారులు చెప్పారు. ఉగ్రవాదులు ఇప్పటి వరకు తమ డిమాండ్ల గురించి చెప్పలేదని విదేశాంగశాఖ అధికారులు తెలిపారు. 
 
కిడ్నాప్‌కి గురైన నలుగురిలో తెలంగాణకు చెందిన వ్యక్తి ఒకరు ఉన్నట్లు సమాచారం. మిగిలిన ముగ్గురు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిగా చెబుతున్నారు. గతంలో కూడా భారతీయులు పలువురు ఇరాక్‌లో అపహరణకు గురయ్యారని అధికారులు చెప్పారు.