గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (13:28 IST)

మగ సింహంతో కలిసి జంప్ అయిన ఆడ సింహం.. ఎక్కడ?

ఆడసింహం మరో మగ సింహంతో కలిసి తప్పించుకుని పారిపోయిన ఘటన ఇరాన్ రాజధాని టెహరాన్‌లో చోటుచేసుకుంది. భద్రతా బలగాలు వెంటనే జూని తమ అధీనంలోకి తీసుకున్నాయి. 
 
జూ అధికారులు వెంటనే స్పందించి తప్పించుకున్న సింహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు ఆ రెండు సింహాలను బంధించి ఎన్ క్లోజర్ లోకి తరలించారు. వివరాల్లోకి వెళితే.. టెహరాన్‌లో ఓ ఆడ సింహం జూలో సంరక్షకుడ్ని బలిగొంది. 
 
ఆ ఆడ సింహం అనేక సంవత్సరాలుగా టెహరాన్ జూలో ఉంది. 40 ఏళ్ల వయసున్న జూ సంరక్షుకుడు ఒకరు సింహం ఉన్న ఎన్ క్లోజర్‌లోకి ప్రవేశించాడు. దాంతో ఒక్కసారిగా అతడిపై ఆడ సింహం దాడి చేసింది. తీవ్రగాయాలపాలైన ఆ ఉద్యోగి మరణించాడు.
 
ఎన్ క్లోజర్ తలుపులు తెరిచి ఉంచడంతో ఆ ఆడ సింహం మరో మగ సింహంతో కలిసి తప్పించుకుని పారిపోయింది. దాంతో జూలో భయాందోళనలు నెలకొన్నాయి.