శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 30 నవంబరు 2016 (09:44 IST)

చికాగో జైలులో వింత ఘటన.. లాకప్‌లో లాక్ అయ్యాడు.. 6లక్షల డాలర్ల నష్టపరిహారం పొందాడు..

అమెరికా దేశంలోని చికాగో జైలులో వింత ఘటన చోటుచేసుకుంది. కుమారుడిని చూసేందుకు విజిటర్‌గా జైలుకు వెళ్ళిన ఓ తండ్రి అనుకోకుండా జైలు పాలయ్యాడు. 2014 జులై నెలలో ఫరద్ పోల్క్ అనే వ్యక్తి కుమారుడిని చూసేందుకు చ

అమెరికా దేశంలోని చికాగో జైలులో వింత ఘటన చోటుచేసుకుంది. కుమారుడిని చూసేందుకు విజిటర్‌గా జైలుకు వెళ్ళిన ఓ తండ్రి అనుకోకుండా జైలు పాలయ్యాడు. 2014 జులై నెలలో ఫరద్ పోల్క్ అనే వ్యక్తి కుమారుడిని చూసేందుకు చికాగో నగరంలోని కుక్ కౌంటీ జైలుకు వెళ్లాడు. ఫరద్ పోల్క్ జైలులో ఉండగానే ఉన్నట్లుండి పొరపాటున జైలు లాకప్‌కు ఆటోమేటిక్ తాళం పడింది. 
 
అంతే ఫరద్ పోల్క్ 8 అడుగులున్న చిన్న గదిలో భారీ స్టీలు తలుపుల మధ్య ఉండిపోయాడు. ఈ జైలు లాకప్ అత్యంత భద్రత కల్పించే ఖైదీలను ఉంచేది. దీంతో ఫరద్ పెట్టిన అరుపులు, కేకలు, ఆర్తనాదాలు జైలు గార్డులకు వినిపించలేదు. దీంతో ఫరద్ ఎలాంటి ఆహారం, మంచినీరు, మరుగుదొడ్డి సౌకర్యం లేకుండా లోపల గదిలో 32 గంటలపాటు ఉండిపోయాడు. 
 
అనంతరం చికాగో అగ్నిమాపకశాఖాధికారులు వచ్చి లాకప్ గది గోడను పగలగొట్టి ఫరద్‌ను కాపాడారు. దీనిపై ఫరద్ తనకు జైలులో కలిగిన అసౌకర్యంపై కోర్టుకు వెళ్లగా బాధితుడికి ఆరులక్షల డాలర్లను నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించింది.