Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆస్ట్రేలియాలో భార్యను వేధించాడు.. హైదరాబాదులో అరెస్టయ్యాడు..

శుక్రవారం, 8 డిశెంబరు 2017 (09:21 IST)

Widgets Magazine
jail

విదేశాల్లో ఉద్యోగం చేసే ఓ వ్యక్తి డబ్బుకు కక్కుర్తి పడి కట్టుకున్న భార్యనే అదనపు కట్నం కోసం వేధించాడు. చివరికి ఆస్ట్రేలియాలో భార్యను వేధించిన  వ్యక్తి హైదరాబాదులో విమానం దిగగానే అరెస్టయ్యాడు. వివరాల్లోకి వెళితే... సికింద్రాబాద్ మౌలాలి గోపాల్ నగర్‌కు చెందిన రాజేందర్ తన కుమార్తె ఇంద్రజ (28)ను నెల్లూరు, మాలాపేటకు చెందిన పి.భరత్ తేజ (33)కు ఇచ్చి జనవరి 24, 2015లో వివాహం చేశారు. 
 
భరత్ విదేశాల్లో పనిచేయడం ద్వారా ఇంద్రజ తల్లిదండ్రులు అడిగినంత కట్నం ఇచ్చేశారు. కానీ పెళ్లైన కొన్ని రోజులకే భరత్ అదనపు కట్నం కోసం ఇంద్రజను వేధించడం మొదలెట్టాడు. దీంతో ఇంద్రజ హైదరాబాద్ వచ్చేసింది. అంతటితో ఆగకుండా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా నుంచి వస్తూ శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన భరత్‌ను అరెస్ట్ చేశారు. కాగా భరత్ తేజ ఆస్ట్రేలియాలోని మేరీ బోర్గ్ నగరంలో ట్రూఫుడ్స్ కంపెనీలో హెల్త్ సేఫ్టీ విభాగంలో పనిచేస్తున్నాడు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అమ్మాయిని సెట్ చేయాలంటూ... విద్యార్థినిపై టీచర్ లైంగికదాడి

విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ టీచర్ కామాంధుడయ్యాడు. హాస్టల్‌లో ఉంటున్న వరుసకు బావ అయ్యే ...

news

మోడీ నీచుడు.. సభ్యత లేనివాడు... అయ్యర్ :: వేటేసిన కాంగ్రెస్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని నీచుడు, సభ్యత లేనివాడు అంటూ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ...

news

మూగబోయిన గుజరాత్ : 9న తొలిదశ పోలింగ్

గుజరాత్ రాష్ట్రం మూగబోయింది. తొలి దశ ఎన్నికల పోలింగ్ జరిగే అసెంబ్లీ సెగ్మెంట్లలో గురువారం ...

news

జగన్‌లా కోట్లు లేవు... లోకేష్‌లా హెరిటేజ్ లేదు... పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ పాలక పార్టీ, ప్రతిపక్ష పార్టీలపై విమర్శనాస్త్రాలు ...

Widgets Magazine