శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 4 మార్చి 2017 (18:39 IST)

వీడిదుంపతెగా... 30 వేల వోల్టుల హైటెన్షన్ వైర్ల షాక్... కిందపడి నడుచుకుంటూ.. (Video)

వంద అడుగుల ఎత్తులో ఉన్న హైటెన్షన్ విద్యుత్ టవర్‌ను ఎక్కాడు. దీంతో 30 వేల వోల్టుల విద్యుత్ ప్రసారమయ్యే తీగల సమీపానికి వెళ్లగానే విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో 100 అడుగుల ఎత్తు నుంచి కింద పడ్డాడు. ఆ

వంద అడుగుల ఎత్తులో ఉన్న హైటెన్షన్ విద్యుత్ టవర్‌ను ఎక్కాడు. దీంతో 30 వేల వోల్టుల విద్యుత్ ప్రసారమయ్యే తీగల సమీపానికి వెళ్లగానే విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో 100 అడుగుల ఎత్తు నుంచి కింద పడ్డాడు. ఆ తర్వాత ఏం జరగనట్టూ తాపీగా లేచి నడుచుకుంటూ వెళ్లాడు. ఈ సంఘటన ప్రత్యక్షంగా చూసిన వారంతా నోరెళ్లబెట్టడం మినహా మరేం చేయలేక పోయారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఆఫ్రికాకు చెందిన వ్యక్తిగా భావిస్తున్న ఓ యువకుడు వంద అడుగుల ఎత్తున్న విద్యుత్ టవర్ ఎక్కి పనిచేస్తున్నాడు. అతడు టవర్‌పై ఉండగా షాక్ కొట్టి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అంత పైనుంచి ఒక్కసారిగా కింద పడ్డాడు. ఈ ఘటనను చూసినవారు అతడు ప్రాణాలు కోల్పోయి ఉంటాడని భావించారు. కానీ అప్పుడే విచిత్రం జరిగింది. కిందపడిన అతడు ఒక్కసారిగా కళ్లు తెరచి చుట్టూ చూసి ఏమీ జరగనట్టు దులుపుకుంటూ ఎంచక్కా నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 
 
శరీరంపై కాలిన గాయాలున్నా ఏమాత్రం చలించకుండా వెళ్లిపోతున్న అతడిని చూసి అందరూ అవాక్కయ్యారు. ఓ వ్యక్తి ఈ మొత్తం ఘటనను వీడియో తీసిన ఓ వ్యక్తి వీడియో తీసి యూట్యూబ్‌లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటన ఏ దేశంలో జరిగిందనే దానిపై సమాచారం లేదు.