Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రక్తపిశాచి కావాలనుకుని.. బాయ్‌ఫ్రెండ్ చేత రక్తం తాగించింది..

బుధవారం, 30 నవంబరు 2016 (11:38 IST)

Widgets Magazine
Blood Knife

టీవీల ఎఫెక్ట్‌తో ఏమో గానీ.. అమెరికాలో ఓ యువతి రక్తపిశాచి కావాలనుకుని బాయ్ ఫ్రెండ్‌చే రక్తం తాగించింది. ఈ ఘటన నవంబర్ 23వ తేదీన అమెరికాలోని స్ప్రింగ్ ఫీల్డ్ లో జరిగింది. తన బాయ్ ఫ్రెండ్‌ను ఇంటికి పిలిపించిన విక్టోరియా వనట్టెర్ అనే టీనేజీ గర్ల్.. అతడితో ముందు మద్యం సేవించేలా చేసింది. ఆ తర్వాత తన రక్తం తాగాలంటూ అతడిని ఒత్తిడి చేసింది. రక్తం తాగడానికి తొలుత ఒప్పుకోలేదు. ఆపై ఓకే చేశాడు. దీంతో, తన చేతిని బాక్స్ కట్టర్ చేత కట్ చేయించి, తన రక్తాన్ని అతడిచేత తాగించింది.
 
ఇంతలో ఏమైందో ఏమో కానీ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో కోపంతో ఊగిపోయిన ఆ యువతి కత్తితో అతనిపై దాడి చేసి, చంపబోయింది. ఈ క్రమంలో, అతని భుజంలో కత్తి కూడా దిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. విక్టోరియా ఇంటికి చేరుకున్నారు. ఆ సమయానికి వారిద్దరూ రక్తపు మడుగులో పడి ఉండగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత వారిద్దరినీ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు. ఆమెను కోర్టులో ప్రవేశపెట్టగా... తనను క్షమించి వదిలేయాలని వేడుకుంది. దీంతో, 1.50 లక్షల డాలర్ల పూచికత్తుతో ఆమెకు జైలు శిక్షను విధించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారిన జేసీ సోదరులు.. పార్టీ చీఫ్ ఫుల్ సపోర్ట్.. క్యాడర్‌లో అసంతృప్తి..

తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి జేసీ సోదరులకు తలనొప్పిగా మారిపోయారు. వారిద్దరిని కట్టడి ...

news

పెళ్లి కానీ జంట సహజీవనం చేయొచ్చు.. ఇండో-పాక్ జంటపై హైకోర్టు సంచలన తీర్పు

ప్రేమించుకున్న ఓ హిందూ యువతి, ఓ ముస్లిం యువకుడు కలిసి ఉండవచ్చని కోర్టు తీర్పు ఇచ్చింది. ...

news

ప్రేయసికి డబ్బివ్వలేదని.. తల్లిదండ్రులను, సోదరిని చంపేసిన దుర్మార్గుడు.. రాత్రంతా శవాలతో గడిపాడు..

ప్రియురాలు అడిగిన డబ్బు ఇవ్వలేదని తల్లిదండ్రులపై అలిగిన ఓ యువకుడు మద్యం తాగి ...

news

చికాగో జైలులో వింత ఘటన.. లాకప్‌లో లాక్ అయ్యాడు.. 6లక్షల డాలర్ల నష్టపరిహారం పొందాడు..

అమెరికా దేశంలోని చికాగో జైలులో వింత ఘటన చోటుచేసుకుంది. కుమారుడిని చూసేందుకు విజిటర్‌గా ...

Widgets Magazine