శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 19 ఏప్రియల్ 2017 (16:46 IST)

బలోచిస్థాన్‌లోనే అతిపెద్ద ఫ్యామిలీ.. ఆయనకు ఆరుగురు భార్యలు.. 54 మంది సంతానం..

ఆయన వయస్సు 70 ఏళ్లు. ఆయనకు ఆరుగురు భార్యలు. 54 మంది పిల్లలు. ఈ వివరాలు బలోచిస్థాన్‌ జనాభా గణాంకాల్లో తేలింది. వివరాల్లోకి వెళితే.. బలోచిస్థాన్‌లోని నోష్కీ జిల్లాకు చెందిన హాజీ అబ్ధుల్ మజీద్ మెంగల్ అన

ఆయన వయస్సు 70 ఏళ్లు. ఆయనకు ఆరుగురు భార్యలు. 54 మంది పిల్లలు. ఈ వివరాలు బలోచిస్థాన్‌ జనాభా గణాంకాల్లో తేలింది. వివరాల్లోకి వెళితే.. బలోచిస్థాన్‌లోని నోష్కీ జిల్లాకు చెందిన హాజీ అబ్ధుల్ మజీద్ మెంగల్ అన 70 ఏళ్ల వ్యక్తికి ఆరుగురు భార్యలున్నారు. ఆరుగురు భార్యల ద్వారా మజీద్ మెంగల్‌కు 54 సంతానం కలిగారు. ఫలితంగా అబ్ధుల్ మజీద్‌ది బలోచిస్థాన్ లోనే అతి పెద్ద కుటుంబం అని జనాభా గణన అధికారులు తేల్చారు.
 
కానీ ఆరుగురు భార్యల్లో ఇద్దరు మరణించగా మిగిలిన నలుగురు మజీద్‌తోనే ఉన్నారు. అలాగే 54 మంది పిల్లల్లో 12 మంది మృతి చెందగా 42 మంది ఉన్నారు. వీరిలో 22 మంది కుమారులు.. 20 మంది కుమార్తెలున్నట్లు జనన గణన అధికారులు వెల్లడించారు. 
 
మజీద్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని.. ఆతడు నలుగురు భార్యలు మరణించాక మరో రెండు వివాహాలు చేసుకున్నాడట. ఇదే తరహాలో బలోచిస్థాన్‌కు చెందిన వైద్యుడైన జాన్ ముహమ్మద్ అనే మరో వ్యక్తికి ముగ్గురు భార్యలు, 36 మంది పిల్లలున్నారని జనాభా గణనలో వివరాల ద్వారా తెలిసింది.