శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 25 అక్టోబరు 2016 (17:06 IST)

స్మార్ట్ ఫోన్ మైకంలో పడి.. రోడ్డుపై చిన్నారిని వదిలేసిన తల్లి.. కారు ఢీ కొట్టడంతో..?

స్మార్ట్ ఫోన్ల మైకంలో పడి.. చాలామంది ప్రపంచాన్ని మరిచిపోతున్నారు. తాజాగా కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లి ఫోన్ మైకంలో పడి.. చిన్నారి మృతికి కారణమైంది. ఈ ఘటన చైనాలోని యుయాంగ్ నగరంలో చోటుచేసుకుంది.

స్మార్ట్ ఫోన్ల మైకంలో పడి.. చాలామంది ప్రపంచాన్ని మరిచిపోతున్నారు. తాజాగా కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లి ఫోన్ మైకంలో పడి.. చిన్నారి మృతికి కారణమైంది. ఈ ఘటన చైనాలోని యుయాంగ్ నగరంలో చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ తన కూతురిని వెంటబెట్టుకుని వెళ్తున్న ఓ మహిళ తన మొబైల్‌లో ఏదో చూస్తూ ఫోనులోనే మునిగిపోయింది. తన చేతులు పట్టుకుని బుడి బుడి అడుగులు వేసుకుంటూ నడిచిన బిడ్డను వదిలిపెట్టేసింది. తదేకంగా ఫోన్ వైపు చూస్తుండిపోయింది.
 
అంతలో అటువైపు వేగంగా వచ్చిన కారు చిన్నారి ఉన్న విషయాన్ని కూడా గ్రహించకుండా.. చిన్నారిని ఢీకొట్టేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారి.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మొబైల్ తీక్షణంగా చూస్తూ ఉండిపోయిన తల్లి.. రోడ్డుపై ఏం జరిగిందో తేరుకోనే లోపే జరగాల్సిన దారుణం జరిగిపోయింది. కూతురు కారు చక్రాల కింద నలిగిపోవడంతో భయపడిపోయిన తల్లి ఏమి చేయాలో తోచక సాయం కోసం బిగ్గరగా అరిచింది. దాంతో అటుగా వెళ్లేవారూ వచ్చి ఆ చిన్నారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. 
 
అయితే అప్పటికే చిన్నారి మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఇదంతా అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాన్ని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చిన్నారి మృతికి కారణమైన కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఫోను మైకంలో పడి బిడ్డ మృతికి కారణమైన ఆ తల్లిని నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.