శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 30 జూన్ 2015 (17:06 IST)

2900 ఏళ్ల క్రితం పేలిన అగ్ని పర్వతం మళ్లీ పేలనుందట.. ఏ క్షణంలోనైనా..?

జపాన్‌లోని మౌంట్ హకోన్ పేలేందుకు సిద్ధంగా ఉందని షాక్ న్యూస్‌ వెలువడింది. జపాన్ మెటియోరోలాజికల్ (జేఎంఏ) అధికారులు హకోన్ అగ్నిపర్వతం ఏ క్షణంలోనైనా పేలేందుకు సిద్ధంగా ఉన్నట్లు హెచ్చరించారు. సుమారు 2900 ఏళ్ల క్రితం జపాన్‌లోని కనగవా ప్రాంతంలో మౌంట్ హకోన్ అగ్నిపర్వతం పేలింది. చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ ఈ అగ్నిపర్వతం పేలేందుకు సిద్ధంగా ఉంది. తద్వారా జపాన్ అధికారులు రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. 
 
మౌంట్ హకోన్ పర్వత ప్రాంతానికి కిలో మీటర్ దూరం వరకు ఎవర్నీ అనుమతించడం లేదు. పర్వత ప్రాంతానికి దగ్గర్లో ఉండే ప్రజలను ఖాళీ చేయించి, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఏ క్షణంలో అయినా పర్వతం పేలే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. 
 
జేఎంఏకు చెందిన నిపుణులు అగ్నిపర్వతాన్ని పరిశీలించారని.. వారు ఇచ్చిన నివేదిక మేరకే అగ్నిపర్వతం పేలనుందనే సమాచారాన్ని వెల్లడిస్తున్నట్లు అధికారులు చెప్పారు. అంతేగాకుండా సోమవారం 14 సార్లు భూమికంపించిందని.. ఇది రిక్టర్ స్కేలుపై 1.9, 3.2గా ఉన్నప్పటికీ.. పేలే ప్రమాదం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసినట్లు జేఎంఏకు చెందిన అధికారులు వెల్లడించారు.