శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 29 ఆగస్టు 2015 (14:23 IST)

'ఒలింపిక్ స్టైల్' తరహాలో నరేంద్ర మోడీకి స్వాగత ఏర్పాట్లు : బ్రిటన్ నిర్ణయం

వచ్చే నవంబర్ నెలలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్రిటన్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ షెడ్యూల్ టూర్ కూడా ఖరారైంది. దీంతో తమ దేశానికి వచ్చే మోడీకి దేశ చరిత్రలో ఏ నేతకూ ఇవ్వనంత ఘనమైన స్వాగతం పలకాలని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం లండన్‌లోని ప్రఖ్యాత వాంబ్లే స్టేడియంలో ఒలింపిక్ స్టైల్‌లో స్వాగత ఏర్పాట్లు చేయనుంది. భారత్‌తో బలమైన సంబంధాలు కోరుకుంటున్నందున్న మోడీకి జీవితంలో మరిచిపోలేని ఆతిథ్యమివ్వాలని నిర్ణయించినట్టు బ్రిటన్ ఉపాధి కల్పనాశాఖామంత్రి ప్రీతి పటేల్ వెల్లడించారు. 
 
కాగా, ఈ సంవత్సరం నవంబరులో తమ దేశంలో పర్యటించనున్న భారత ప్రధాని మోడీకి, దేశ చరిత్రలో ఏ నేతకూ ఇవ్వనంత ఘనమైన స్వాగతాన్ని ఇవ్వాలని బ్రిటన్ సంకల్పించింది. నవంబర్ రెండో వారంలో మోడీ పర్యటన ఖరారు కాగా, ఇక్కడి ప్రఖ్యాత 'వాంబ్లే' స్టేడియంలో 'ఒలింపిక్ స్టైల్' తరహాలో స్వాగతం పలకాలని నిర్ణయించింది. 
 
"టూ గ్రేట్ నేషన్స్. వన్ గ్లోరియస్ ఫ్యూచర్" థీమ్‌తో స్వాగత వేడుకలు జరుగుతాయని యూరప్ ఇండియా ఫోరమ్ ప్రకటించింది. ఈ స్టేడియంలోనే సుమారు 70 వేల మంది ఆహూతులను ఉద్దేశించి మోడీ ప్రసంగిస్తారు కూడా. మోడీ విదేశాల్లో అత్యధికులను ఉద్దేశించి చేసే ప్రసంగం కూడా ఇదే కానుంది. స్టేడియంలో సాంస్కృతిక ప్రదర్శనలు అబ్బుర పరిచేలా ఉంటాయని, ఫైర్ వర్క్స్ అందరినీ ఆకర్షిస్తాయని, అదేసమయంలో భారత్‌లో దీపావళి జరగనుండటంతో, అంతే తరహా దీపాల కాంతులు విరజిమ్మనున్నాయని భారతీయ జనతా పార్టీ ఓవర్సీస్ ఫ్రెండ్స్ కన్వీనర్ విజయ్ చౌతియావాలే వివరించారు.