ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 16 జులై 2018 (17:46 IST)

ఇండోనేషియాలో మొసళ్ల ఊచకోత.. ఏకంగా 300 మొసళ్లను చంపేశారు..

ఇండోనేషియాలోని పపువా ప్రావిన్స్‌లో 300 మొసళ్లను ఊచకోత కోశారు గ్రామస్తులు. తమ గ్రామస్తుడిని చంపేసిందనే కోపంతో.. ఏకంగా 300 మొసళ్లను చంపేశారు. వివరాల్లోకి వెళితే.. జనావాసాల మధ్యలో ఓ మొసళ్ల ఎన్ క్లోజర్‌లో

ఇండోనేషియాలోని పపువా ప్రావిన్స్‌లో 300 మొసళ్లను ఊచకోత కోశారు గ్రామస్తులు. తమ గ్రామస్తుడిని చంపేసిందనే కోపంతో.. ఏకంగా 300 మొసళ్లను చంపేశారు. వివరాల్లోకి వెళితే.. జనావాసాల మధ్యలో ఓ మొసళ్ల ఎన్ క్లోజర్‌లో ఇటీవలే సుగితో (48) అనే వ్యక్తి గడ్డి కోయడానికి వెళ్లి పడిపోయారు. అందులో ఉన్న ఓ మొసలి అతన్ని చంపేసింది. అదే రోజు స్థానికులు అతనికి అంత్యక్రియలను నిర్వహించారు. 
 
అనంతరం సుగి కుటుంబం సహా గ్రామస్తులంతా కలసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనావాసాల మధ్య మొసళ్ల ఎన్‌క్లోజర్ ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపరిహారం చెల్లిస్తామని ఎన్‌క్లోజర్ సిబ్బంది చెప్పినప్పటికీ వారు ఏమాత్రం పట్టించుకోలేదు. అంతటితో ఆగకుండా కత్తులు, కట్టెలతో ఎన్‌క్లోజర్ వద్దకు వెళ్లి.. ఒక్కో మొసలిని బయటికి లాగి.. 300 మొసళ్లను చంపేశారు. గ్రామస్తులు చంపిన మొసళ్లలో పెద్ద పెద్ద మొసళ్లు, చిన్ని చిన్ని మొసళ్లు వున్నాయి.