Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

న్యూజిలాండ్‌కు పెను సునామీల ముప్పు .. తప్పించుకునేందుకు 7 నిమిషాలేనట (వీడియో)

సోమవారం, 27 నవంబరు 2017 (19:37 IST)

Widgets Magazine
new zealand earth quake

ప్రపంచంలో అత్యంత సుదరమైన పర్యాటక ప్రాంతాలు కలిగిన దేశం న్యూజిలాండ్. ఈ దేశానికి పెనుముప్పు పొంచివుందట. కివీస్‌ను పెను సునామీలు ముంచెత్తనున్నాయట. ఈ విషయాన్ని జియాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ఈ సునామీల నుంచి న్యూజిలాండ్ ప్రజలు తప్పించుకునేందుకు కేవలం ఏడు నిమిషాల సమయం మాత్రమే ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు.
 
ఇదే అంశంపై జియాలజిస్టులు స్పందిస్తూ, న్యూజిలాండ్‌ ద్వీపంలో పెను భూకంపాలు విధ్వంసం సృష్టిస్తాయని హెచ్చరిస్తున్నారు. దీనికి కారణం న్యూజిలాండ్‌కు సమీపంలో ఉన్న హికురంగీ పీఠభూమిలో కదలికలు వస్తున్నాయనీ, వీటివల్ల పెను భూకంపాలు సంభవించి, వీటి కారణంగా భారీ సునామీలు విరుచుకుపడే అవకాశం ఉందని చెపుతున్నారు. 
 
ఇందులోభాగంగా, సోమవారం కివీస్‌లో రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రతతో కూడిన భూకంపం ఆదేశ రాజధాని వెల్లింగ్టన్‌లో సంభవించిందనీ గుర్తుచేశారు. మున్ముందు 9.0 కంటే అధిక తీవ్రతతో భూకంపాలు సంభవించి, తర్వాత పెను సునామీలు న్యూజిలాండ్‌ను ముంచెత్తుతాయని జియాలజిస్టులు చెప్పారు.
 
సునామీ నుంచి తప్పించుకునేందుకు న్యూజిలాండ్‌ ప్రజలకు కేవలం 7 నిమిషాల టైం మాత్రమే ఉంటుందని హెచ్చరించారు. కాగా, పీఠభూమిలో కదలికలు రావడంతో గత 2004లో ఇండోనేసియాలోని సుమత్రా దీవుల్లో రిక్టర్ స్కేలుపై 9.1 తీవ్రవతతో భూకంపం సంభవించి పెను సునామీ వచ్చిన విషయం తెల్సిందే. ఈ సునామీ అనేక దేశాల్లో భారీగా ఆస్తి, ప్రాణ నష్టాన్ని మిగిల్చింది.

 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఇండో - పాక్‌ల మధ్య న్యూక్లియర్ వార్? పశ్చిమ దేశాల్లో టెన్షన్

దక్షిణాసియాలో అణ్వాయుధాలు కలిగిన దేశాల్లో చైనా, భారత్, పాకిస్థాన్‌లు ఉన్నాయి. అయితే, ...

news

సింగపూర్‌కు ఏపీ రైతుల బృందం... ఎందుకు?

అమరావతి: సింగపూర్‌కు 34 మందితో కూడిన రెండో విడత రాజధాని ప్రాంత రైతుల బృందం సోమవారం ...

news

తెలంగాణ సర్కారు విందుకు మోడీ - ఇవాంకా గైర్హాజరు (Video)

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో అంతర్జాతీయ ...

news

కేసీఆర్ డెకరేషన్స్... ఇవాంకా కోసమే ఇలానా? తెలంగాణ జనం చిందులు(ఫోటోలు-వీడియో)

రేపు తెలంగాణ రాజధానికి హైదరాబాదులో ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు జరుగబోతోంది. ఈ ...

Widgets Magazine