శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 18 ఏప్రియల్ 2015 (12:46 IST)

పెచ్చరిల్లిపోతున్న నైజీరియన్ల ఆగడాలు.. ఎస్‌ఐపై దాడి!

నైజీరియన్ల ఆగడాలు నగరంలో పెచ్చరిల్లిపోతున్నాయి. చదువు పేరుతో వచ్చిన వీరంతా దౌర్జన్యంగా దాడులు చేస్తున్నారు. కొంతమంది వీసా గడువు ముగిసినా కూడా అక్రమంగా ఉంటూ పలు మోసాలు చేస్తూ ఇక్కడే ఉంటున్నారు. గతంలో వీళ్లు పోలీసులపై దాడి చేసిన దాఖలాలు ఉన్నాయి. 
 
ఇదే తంతు శుక్రవారం రాత్రి కొనసాగింది. ఏకంగా నైజీరియన్లు ఎస్ఐ‌పై దాడి చేశారు. లంగర్హౌస్ బాపూఘాట్ ప్రాంతంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అంతలో అటుగా కారులో వెళ్తున్న ముగ్గురు నైజీరియన్లు కారు ఆపమన్నందుకు పోలీసు అధికారిపై దాడి చేశారు. తరువాత ఆ ముగ్గురు పారిపోయారు. 
 
పోలీసులు వెంబడించగా ఇద్దరు తప్పించుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వీళ్లని నైజీరియన్ చట్టాల ప్రకారం విచారించాల్సి రావడంతో పోలీసులు కూడా కఠినంగా శిక్షించలేకపోతున్నారు.