శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 6 డిశెంబరు 2017 (10:21 IST)

నేనేం తప్పు చేయలేదు.. ఏ ఒక్క బ్యాంకును మోసం చేయలేదు: మాల్యా

భారత్‌లోని ఏ ఒక్క బ్యాంకును కూడా తాను మోసం చేయలేదని విజయ్ మాల్యా అన్నారు. వ్యాపారంలో నష్టం వస్తే తామేం చేయగలమని తెలిపారు. లండన్‌లోని వెస్ట్ మినిస్టర్స్ కోర్టులో తన అప్పగింతపై వాదనలు జరుగుతున్న వేళ మాల

భారత్‌లోని ఏ ఒక్క బ్యాంకును కూడా తాను మోసం చేయలేదని విజయ్ మాల్యా అన్నారు. వ్యాపారంలో నష్టం వస్తే తామేం చేయగలమని తెలిపారు. లండన్‌లోని వెస్ట్ మినిస్టర్స్ కోర్టులో తన అప్పగింతపై వాదనలు జరుగుతున్న వేళ మాల్యా లాయర్లు ఇలా చెప్పుకొచ్చారు. అంతేగాకుండా తమ క్లయింట్ ఏ ఒక్క రూపాయిని కూడా వ్యక్తిగతంగా తీసుకోలేదని.. అవి ఓ కంపెనీ పేరిట తీసుకున్నవేనన్న విషయాన్ని మాల్యా లాయర్లు కోర్టు ముందు వెల్లడించారు. 
 
యూబీ గ్రూప్ మాజీ ఛైర్మన్, రూ.9వేల కోట్లకు పైగా రుణాలు వేసి.. వాటిని తీర్చకుండా బ్రిటన్ పారిపోయి విజయ్ మాల్యా చేసిన తప్పేమీ లేదన్నారు.  తమ క్లయింట్ ఏ ఒక్క రూపాయిని కూడా వ్యక్తిగతంగా తీసుకోలేదని, అవి ఓ కంపెనీ పేరిట తీసుకున్నవని వాదిస్తూనే, ఆయన ఎవరినీ మోసం చేయలేదని చెప్పుకొచ్చారు. 
 
కింగ్ ఫిషర్ కోసం రుణాలు తీసుకోకముందు, ఆ తర్వాత క్రూడాయిల్ ధరలు పెరిగిన విషయాన్ని లాయర్లు ఈ సందర్భంగా ప్రస్తావించారు. వ్యాపారం విఫలమైందని అందుకే తాము నష్టపోయామని తెలిపారు. ఇరు పక్షాల వాదనలూ విన్న న్యాయస్థానం, కేసు విచారణను వాయిదా వేసింది.

మరోవైపు విజయ్ మాల్యాను ఎలాగైనా భారత్‌కు తీసుకురావాలని లండన్ వెళ్లిన సీబీఐ.. ఈడీ బృందాలు తదుపరి దశలో మరింత గట్టిగా వాదనలు వినిపించేందుకు సై అంటోంది.