గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 6 జులై 2018 (12:18 IST)

పాకిస్థాన్ నేతలు మహాముదుర్లు.. 60మందికి రెండో పెళ్లి.. ఇమ్రాన్ మోదీని?

పాకిస్థాన్ నేతలు మహాముదుర్లు. ఎన్నికల్లో నిలిచే 60మంది నేతలకు రెండో పెళ్లి జరిగిందట. ఈ విషయం నామినేషన్ పేపర్ల ద్వారా తెలిసినట్లు ఓ రిపోర్ట్ ద్వారా వెల్లడి అయ్యింది. సార్వత్రిక ఎన్నికలకు పాకిస్థాన్ సన్

పాకిస్థాన్ నేతలు మహాముదుర్లు. ఎన్నికల్లో నిలిచే 60మంది నేతలకు రెండో పెళ్లి జరిగిందట. ఈ విషయం నామినేషన్ పేపర్ల ద్వారా తెలిసినట్లు ఓ రిపోర్ట్ ద్వారా వెల్లడి అయ్యింది. సార్వత్రిక ఎన్నికలకు పాకిస్థాన్ సన్నద్ధమవుతోంది. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వివిధ పార్టీల నుంచి బరిలో నిలిచిన అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు.
 
ఇలా సమర్పించిన వారిలో 60 మంది నేతలు తమ రెండో పెళ్లి విషయాన్ని దాచిపెట్టనట్టు ఎన్నికల కమిషన్ గుర్తించింది. రెండో పెళ్లి గుట్టును బయటపెట్టని వారిలో ప్రముఖ నేతలు ఉండడం విశేషం. రెండో వివాహాన్ని గుట్టుచప్పుడు కాకుండా దాచేసిన 60మందిలో పంజాబ్ ముఖ్యమంత్రి షేబాజ్ షరీఫ్, ఆయన కుమారుడు హమ్జా షేబాజ్, మాజీ ప్రతిపక్ష నేత ఖుర్షీద్ షా, ఎంక్యూఎం-పీ చీఫ్ ఫరూక్ సత్తార్, రైల్వే మాజీ మంత్రి ఖావాజా సాద్ రఫీక్, అర్షాద్ వోహ్రా, పిర్ అమిన్, ఖైసర్ మెహ్‌మూద్, రానా ముబాషార్ తదితరులు ఉన్నారు. నామినేషన్ పత్రాల స్క్రూటినీలో భాగంగా ఈ విషయం వెలుగుచూసింది.
 
మరోవైపు ఈ నెల 25 పాకిస్థాన్ లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మాజీ క్రికెటర్, పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ, పాకిస్థాన్‌లో గెలవాలంటే డబ్బు, వేల మంది శిక్షణ తీసుకున్న పోలింగ్ ఏజెంట్లు కావాలని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడినప్పుడే మిలిటరీ పాలనను ప్రజలు ఆహ్వానిస్తారని అన్నారు. 
 
పనిలో పనిగా భారత ప్రధాని మోదీపై ఇమ్రాన్ ఖాన్ విమర్శలు గుప్పించారు. భారత్-పాకిస్థాన్‌ల మధ్య సంబంధాలు మరింత దెబ్బతినడానికి కారణం  మోదీ నేతృత్వంలోని ప్రభుత్వమేనని ఆరోపించారు. అంతర్జాతీయంగా పాకిస్థాన్‌ను ఏకాకిని చేయాలనే ఉద్దేశంతో మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. 
 
కాశ్మీర్‌లో ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న దురాగతాలన్నింటికీ తమ దేశాన్ని మోదీ సర్కార్ నిందిస్తోందని, నవాజ్ షరీఫ్ ప్రధానిగా ఉన్న సమయంలో భారత్‌తో సత్సంబంధాల కోసం ఎంతగానో ఆయన ప్రయత్నించారని, మోదీని తన ఇంటికి కూడా షరీఫ్ ఆహ్వానించారని చెప్పుకొచ్చారు.