శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 18 మే 2017 (07:30 IST)

అణు బాంబుకు ఉత్తర కొరియా సిద్ధం.. అమెరికాకు ముచ్చెమటలు!

ఉత్తర కొరియా నియంత, ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ పెను విపత్తుకు కారణమయ్యేలా ఉన్నాడు. ఏదో ఒక ప్రాంతంలో అణు బాంబుతో దాడి చేయాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు. దీంతో అగ్రరాజ్యం అమెరికాకు ముచ్చెమటలు పడుతున్నా

ఉత్తర కొరియా నియంత, ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ పెను విపత్తుకు కారణమయ్యేలా ఉన్నాడు. ఏదో ఒక ప్రాంతంలో అణు బాంబుతో దాడి చేయాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు. దీంతో అగ్రరాజ్యం అమెరికాకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఉత్తర కొరియా చేతిలో భారీ మొత్తంలో అణు బాంబులు ఉండటంతో వాషింగ్టన్ బెంబేలెత్తిపోతున్న విషయం తెల్సిందే. పైగా.. ఉ.కొరియా చేతిలో అణు బాంబులు ఉండటం పిచ్చోడి చేతిలో రాయిలా తయారైందని పలువురు అంతర్జాతీయ విశ్లేషకులు ఇప్పటికే అభిప్రాయపడిన విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో.. అమెరికన్ల గుండెల్లో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ గుబులు పుట్టిస్తున్నాడు. ఇటీవల దూకుడుగా ఆయన నిర్వహిస్తున్న క్షిపణి ప్రయోగ పరీక్షలు అందుకు కారణమవుతున్నాయి. అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలను కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఆదివారం నిర్వహించిన బాలిస్టిక్ క్షిపణి ప్రయోగంపై అమెరికా పసిఫిక్ ఆడ్మిరల్ హారీ హర్రిస్ ఆందోళన వ్యక్తం చేశారు. 
 
కిమ్ దూకుడు పద్ధతి చూస్తుంటే అణు యుద్ధానికి ఏమాత్రం భయపడడంలేదని అర్థమవుతోందని, ప్రపంచంలో ఏదోఒక ప్రాంతంలో అణుబాంబుని ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నారనిపిస్తోందని ఆయన హెచ్చరించారు. పెనువిపత్తును ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. కిమ్‌తో పెట్టుకోవడం అంటే నిప్పుతో చెలగాటం ఆడడమేనని ఆయన అభివర్ణించారు.