సోమవారం, 24 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 17 సెప్టెంబరు 2017 (08:54 IST)

వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు.. ఆరునూరైనా అనుకున్నది చేస్తా: కిమ్ జాంగ్ ఉన్

అగ్రరాజ్యం అమెరికాను ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ మరింత బిగ్గరగా హెచ్చరించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ వెనక్కితగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఆరునూరైనా అనుకున్నది చేస్తానని పునరుద్ఘాటించారు.

అగ్రరాజ్యం అమెరికాను ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ మరింత బిగ్గరగా హెచ్చరించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ వెనక్కితగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఆరునూరైనా అనుకున్నది చేస్తానని పునరుద్ఘాటించారు. 
 
అణ్వస్త్రాల అర్జనలో అమెరికాతో సమఉజ్జీగా నిలవడమే తన లక్ష్యమని, ఆ దేశంతో పోలిస్తే ఒక్క మెట్టు కూడా దిగేది లేదని అన్నారు. మరింత వేగంతో అణ్వాయుధాలను సమకూర్చుకోవాలన్నది తన లక్ష్యమని, పూర్తి స్థాయి అణు సామర్థ్యానికి చేరుకునే వరకూ తాను విశ్రమించనని, ఆరునూరైనా అనుకున్నది చేసి తీరుతానని స్పష్టం చేశారు. 
 
తన లక్ష్య సాధనకు చాలా దగ్గరికి వచ్చినట్టేనని అన్నారు. అమెరికాతో ప్రత్యక్షంగా తలపడేందుకు అవసరమైన శక్తిని తన దేశం అతి త్వరలోనే సంపాదించుకుంటుందని అన్నారు. దాదాపు 2,300 మైళ్ల దూరం ప్రయాణించి లక్ష్యాన్ని తాకగల మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి విజయవంతం అయిన సందర్భంగా అధికారులతో కిమ్ సమావేశమయ్యారు. 
 
కాగా, కిమ్ జాంగ్ చేసిన కటువు వ్యాఖ్యల వెనుక, ఆయన మనసులోని మరో కోణం కూడా బయటకు వచ్చిందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికాతో సమానమయ్యే శక్తిని పొందేందుకు ఎంతో కాలం పట్టదని ఆయన చెప్పిన మాటలు, త్వరలోనే క్షిపణి పరీక్షలకు స్వస్తి చెప్పే అవకాశాలను చూపిస్తున్నాయని సియోల్‌లోని యోన్సే యూనివర్శిటీ ప్రొఫెసర్ జాన్ డీలూరీ అభిప్రాయపడ్డారు.