శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR

ప్రోటోకాల్ పట్టించుకోని మోడీ.. ఒబామాకు ఆత్మీయ ఆలింగన స్వాగతం!

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా విభిన్నతను చూపుతున్నారు. సాధారణంగా విదేశాల అధిపతులు దేశానికి వచ్చినపుడు ఆయన స్వయంగా విమానాశ్రయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ, ఆదివారం న్యూఢిల్లీకి వచ్చిన అగ్రరాజ్యాధిపతి బరాక్ ఒబామా దంపతులకు ఘన స్వాగతం పలికేందుకు పాత విధానాన్ని పక్కన బెట్టి స్వయంగా ఎయిర్‌పోర్టుకు వెళ్లి ఆత్మీయ ఆలింగన స్వాగతం పలకడం గమనార్హం. ఇది ఇపుడు చర్చనీయాంశమైంది. 
 
వచ్చింది అగ్రరాజ్యాధి నేత అయినప్పటికీ స్వాగతం పలికేందుకు మోడీ వెళ్ళాల్సిన అవసరం లేదనీ, విదేశాంగశాఖ మంత్రి, ముఖ్య అధికారులు మాత్రం వెళితే సరిపోతుంది. కానీ సంప్రదాయాలు కాదని మోడీ వెళ్లి స్వాగతం పలకడం వెనుక అమెరికాతో మరింత బలమైన బంధాన్ని కోరుకుంటున్నారని సంకేతాలను ఆయన పంపినట్టు అయిందని అంతర్జాతీయ విశ్లేషకులు చెపుతుండగా, వామపక్ష, విపక్ష నేతలు మాత్రం భారత సార్వభౌమత్వాన్ని అమెరికా ముందు తాకట్టు పెడుతున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.