శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : మంగళవారం, 7 జులై 2015 (10:06 IST)

ఒబామా కుమార్తె పార్ట్‌టైమ్ జాబ్‌... ఎక్క‌డ‌? ఏం ఉద్యోగం?

ప్రపంచదేశాలకు పెద్దన్న పాత్ర పోషించే అమెరికా అధ్యక్షుడి కూతురు.. కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నా జరిగిపోతుంది. చిటికేస్తే పనిమనుషులు.. అయినా ఆమె ఉద్యోగం చేయాల‌నుకుంది. అదీ చ‌దువుకుంటూనే సంపాదించాల‌నుకుంది. ఇక అంతే.. ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా ఉద్యోగంలో చేరిపోయింది అమెరికా అధ్య‌క్షుడు ఓబామా పెద్ద కుమార్తె మాలియా.. మాలియా ఎక్క‌డ ఉద్యోగం చేస్తోంది? ఏం ఉద‌్యోగం చేస్తోంది? 
 
అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా కుమార్తె చదువుతోపాటే పార్ట్ టైమ్ ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుందట. ఒబామా పెద్ద కుమార్తె మాలియా (17) డిగ్రీ వచ్చే ఏడాది పూర్తి కానుంది. అయితే చదువుతోపాటే ఉద్యోగమూ చేస్తే అప్పటికి అనుభవం గడించొచ్చన్న ముందు చూపుతో ఇలా డిసైడ్ అయిందట. 
 
టీవీ లేదా సినిమా వంటి ఎంటర్‌టైన్‌మెంట్ రంగాన్నే కెరీర్‌గా ఎంచుకుంటానన్న మాలియా ఆ దిశగానే అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఆమె హెచ్‌బీవో చానల్‌లో ప్రసారమయ్యే ‘గర్ల్స్’ సిరీస్‌లో తాత్కాలిక ఉద్యోగినిగా చేరిందని సమాచారం.