సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 25 మార్చి 2018 (13:04 IST)

చైనాలో అవయవ దోపిడి.. మారణ హోమం.. ఎలా జరుగుతుందంటే?

చైనాలో ఓ సర్జన్ బాంబు పేల్చాడు. చైనాలో అవయవ దోపిడి జరుగుతోందని షాకింగ్ నిజాలు బయట పెట్టాడు. 1990 నుంచి ఈ మారణ హోమం చైనాలో నిరంతరాయంగా జరుగుతోందని తెలిపాడు. ఆ డాక్టర్ పేరు డాక్టర్‌ ఎన్వార్‌ థోటీ. చైనాల

చైనాలో ఓ సర్జన్ బాంబు పేల్చాడు. చైనాలో అవయవ దోపిడి జరుగుతోందని షాకింగ్ నిజాలు బయట పెట్టాడు. 1990 నుంచి ఈ మారణ హోమం చైనాలో నిరంతరాయంగా జరుగుతోందని తెలిపాడు. ఆ డాక్టర్ పేరు డాక్టర్‌ ఎన్వార్‌ థోటీ. చైనాలో జరిగే ఈ మారణ హోమం కళ్లారా చూడలేక ఆయన చైనా నుంచి పారిపోయాడు. 
 
మనుషుల అవయవాలను ఆన్‌ డిమాండ్‌పై సరఫరా చేయడంలో చైనా ముందుంటుంది. చైనా కమ్యూనిస్ట్‌పార్టీ నేతలకు, సంపన్నులకు అవయవాలు అవసరమైతే రాజకీయ ఖైదీల అవయవాలను బలవంతంగా తొలగించి అమర్చుతున్నారని ఎన్వార్ థోటీ తెలిపారు. 
 
ఆన్‌లైన్‌లో అవయవాలపై ప్రకటనలు కూడా చైనాలో బాగానే కనిపిస్తాయి. ఈ అవయవ దోపిడీకి బలయ్యే వారంతా ఫలూన్‌ గాంగ్‌ అనే ఒక శాంతియుత సంస్థకు చెందిన రాజకీయ ఖైదీలని ఎన్వార్ థోటీ వెల్లడించారు. 
 
ఎంతో అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, జర్మనీ వంటి చోట్ల కూడా అవయవ మార్పిడికి కొన్ని నెలల నుంచి ఏళ్ల వరకు ఎదురు చూడాల్సి వస్తోంది. కానీ ఆశ్చర్యకరంగా చైనాలో మాత్రం ఏటా లక్ష వరకు అవయవ మార్పిడి ఆపరేషన్లు జరుగుతున్నాయి.