శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 27 మే 2016 (13:42 IST)

భార్యలను ఎపుడెపుడు కొట్టాలంటే.. పాకిస్థాన్‌లో కొత్త చట్టం

పాకిస్థాన్‌క్‌లోని ప్రభుత్వ గుర్తింపు పొందిన ఓ మతపరమైన సంస్థ.. మహిళల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన ఓ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికలో వెల్లడించిన అంశాలు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ద కౌన్సిల్ ఆఫ్ ఇస్లామిక్ ఐడియాలజీ(సిఐఐ) అనే సంస్థ ఇటీవల పాక్‌లోని పంజాబ్ ప్రభుత్వం మహిళల రక్షణకు చేసిన పీపీడబ్ల్యూఏ చట్టం సరిగా లేదని దానిస్థానంలో కొత్త చట్టం తీసుకురావాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. 
 
అందులో పొందుపరిచే అంశాలేంటంటే మహిళలను అవసరమైతే భర్తలు కొట్టొచ్చు.. అది కూడా కొంచెం మెల్లగా కొట్టాలంటూ వెల్లడించింది. ఏఏ సందర్భాల్లో భార్యలను కొట్టొచ్చో అది కూడా నివేదికలో క్షుణ్ణంగా తెలియజేశారు. దీనిలోని మరికొన్ని అంశాలను పరిశీలిస్తే.. భర్త చెప్పిన మాటను లెక్కచేయకుండా భార్య దురుసుగా ప్రవర్తించినప్పుడు, భర్త చెప్పిన విధంగానే దుస్తులు ధరించకపోవడం, బురఖా ధరించకుండా ముక్కూమొహం తెలియని వ్యక్తులతో సంభాషించివప్పుడు ఇటువంటి పలు సందర్భాల్లో భార్యను మెల్లగా కొట్టొచ్చు అంటూ ఆ నివేదికలో పేర్కొంది.