Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భారత్‌పై అణ్వాయుధాలతో దాడి చేస్తాం : పాకిస్థాన్

ఆదివారం, 14 జనవరి 2018 (13:41 IST)

Widgets Magazine
khawaja asif

తమ పాలకులు అనుమతిస్త భారత్‌పై అణ్వాయుధాలతో దాడి చేయనున్నట్టు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఖ్వాజా ముహమ్మద్‌ ఆసిఫ్‌ వెల్లడించారు. భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఇటీవల మాట్లాడుతూ, నిబంధనలకు విరుద్ధంగా పాకిస్థాన్ అణు ఆయుధాలను పెంచుకుంటూ, ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని, ప్రభుత్వం అనుమతిస్తే, తాము పాకిస్థాన్‌పై అణు యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ చేశారు. 
 
భారత ఆర్మీ చీఫ్ చాలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతూ తమను కవ్విస్తున్నాడని ఆరోపించిన ఆయన, అణు దాడికి భారత్ తమకు ఆహ్వానం పంపుతోందని అన్నారు. యుద్ధానికి కాలుదువ్వితే, తాము కూడా సిద్ధమేనని, భారత్‌పై తీవ్ర స్థాయిలో అణు బాంబులు వేయగల సత్తా తమకుందని ఆయన హెచ్చరించారు. 
 
మరోవైపు, భారత్ తన రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. అగ్ని సిరీస్‌లో భాగంగా అభివృద్ధి చేసిన అత్యాధునిక క్షిపణి అగ్ని-5ను పరీక్షించేందుకు సమాయత్తమవుతోంది. ఈనెల 18, 19 తేదీల్లో ఒక రోజున దీనిని పరీక్షించేందుకు వ్యూహాత్మక దళాల కమాండ్ సన్నాహాలు చేస్తోంది. పరీక్షకు అవసరమైన అన్నింటిని దాదాపు సిద్ధం చేశారు.
 
మొత్తం 17 మీటర్ల పొడవు ఉండే అగ్ని-5 క్షిపణి 5 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను అవలీలగా తుత్తునియలు చేయగలదు. 1.5 టన్నుల వార్‌హెడ్‌లను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఇది ఏక కాలంలో పలు లక్ష్యాలపై దాడి చేయగలదు. శత్రుదేశ రాడార్లకు చిక్కకుండా తన పనిని పూర్తి చేయగలదు. 
 
అగ్ని-5కు ఐదువేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సత్తా ఉండడంతో పరీక్షల నిమిత్తం ఇండోనేషియా, ఆస్ట్రేలియాలను అప్రమత్తం చేయనున్నట్టు సమాచారం. మరోవైపు ఈ అగ్ని-5 పరీక్షతో పాక్ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. పాక్‌ మొత్తం ఈ క్షిపణి పరిధిలోకి వస్తుండడంతో దాని వెన్నులో వణుకు మొదలైంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అగ్ని-5 పరీక్షకు సిద్ధమైన భారత్.. పాకిస్థాన్‍కు ముచ్చెమటలు

భారత్ తన రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. అగ్ని సిరీస్‌లో ...

news

గోదావరి జిల్లాలో జోరుగా కోళ్ల పందేలు... రూ.కోట్లలో బెట్టింగ్స్

సంక్రాంతి పండుగ అంటేనే కోళ్ల పందేలు. ఎవరు ఎన్ని చెప్పినా... కోర్టులు వివిధ రకాల అంక్షలు ...

news

రూ.500 ఇస్తే చాలు.. మీరేమైనా చేసుకోవచ్చు.. రొమాన్స్ కేంద్రాలుగా పార్కులు

హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న ప్రధాన పార్కులు అసాంఘిక కార్యక్రమాలు అడ్డాలుగా మారాయి. ...

news

నారావారి పల్లెలో భోగిమంటలు.. చంద్రబాటు ఇంట సందడేసందడి..

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఇంటే సంక్రాంతి సందడి అంతా నెలకొనివుంది. చంద్రబాబు దంపతులతో ...

Widgets Magazine