Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పాకిస్థాన్ అణ్వాయుధాలను అక్కడ భద్రంగా దాచేస్తోంది... భారత్‌కు గండమేనా?

గురువారం, 18 మే 2017 (15:05 IST)

Widgets Magazine

పాకిస్థాన్ అణ్వాయుధాలను ఖైబర్ పష్తూన్‌క్వా సమీపంలోని పీర్ థాన్ పర్వతం దగ్గర దాస్తోందని మిలిటరీ ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలిసింది. ఉపగ్రహం ద్వారా మిలిటరీ ఇంటెలిజెన్స్ సేకరించిన సమాచారం ప్రకారం పీర్ థాన్ పర్వతం దగ్గర షహీన్-3 బ్యాలిస్టిక్ మిసైల్స్‌ను రహస్యంగా మోహరించి వుండవచ్చునని తెలుస్తోంది. అణ్వాయుధాలను ప్రయోగించాల్సిన సామర్థ్యం ఈ క్షిపణులకు ఉంది. 
 
ఇలా పాకిస్థాన్ అణ్వాయుధాలను నిల్వ చేయడం భారత్‌కు ఆందోళనకరమేనని విశ్లేషకులు అంటున్నారు. అణ్వాయుధాలు దాచిన పీర్ థాన్ పర్వత ప్రాంతం భారతదేశంలోని అమృత్‌సర్‌కు 320 కి.మీ. దూరంలోనూ, చండీగఢ్‌కు 520 కి.మీ. దూరంలోనూ, న్యూఢిల్లీకి 720 కి.మీ. దూరంలోనూ ఉంది. అణ్వాయుధాలను ప్రయోగించేందుకు అనువైన ఈ మిసైల్స్ 2,750 కి.మీ. దూరంలోని లక్ష్యాలను సమర్థంగా ఛేదించగలవని మిలటరీ వర్గాలు తెలిపాయి. దీంతో భారత్‌కు పాకిస్థాన్‌తో గండం తప్పదని విశ్లేషకులు హెచ్చరించింది. 
 
ఇప్పటికే సరిహద్దుల వల్ల కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ.. భారత సైనికులపై ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్న పాకిస్థాన్‌కు అణ్వాయుధాలు తోడైతే పరిస్థితి ఏవిధంగా ఉంటుందనేది అర్థం చేసుకోవాల్సి వుందని.. కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్ చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని మిలటరీ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సోదరిని ఏడిపించారు.. కత్తితో దాడి చేశారని.. మైనర్ ఆ ఇద్దరిని చంపేశాడు..

సోదరిని ఏడిపించి.. కత్తితో దాడికి పాల్పడిన వారిపై ఢిల్లీకి చెందిన మైనర్ ప్రతీకారం ...

news

కేంద్ర మంత్రి అనిల్ మాదవ్ దవే మృతి.. పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా?

గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ ఛేంజ్ పార్లమెంట్‌ కమిటీలో కీలక సభ్యుడు.. కేంద్ర పర్యావరణ, ...

news

రాజకీయాల్లోకొచ్చి పవన్ పెళ్లి చేసుకున్నాడు... మరి రజనీ పరిస్థితేమిటి..? సిల్క్ స్మితకు కబాలికి లింకేంటి?

ఇప్పటిదాకా అందరివాడిగా మన్ననలు పొందిన రజనీకాంత్ త్వరలో కొందరివాడిగా మారబోతున్నాడు. ఏ ...

news

నిరుద్యోగ భృతి పథకం అమలు.. నెలకు రూ.5వేలు.. ట్రైనింగ్ ప్లస్ ఉద్యోగం కూడా..?

ఎన్నికల హామీని నెరవేర్చే దిశగా ఏపీ సర్కారు అడుగులు వేస్తోంది. ఎన్నికల హామీలో భాగంగా ...

Widgets Magazine