సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (12:26 IST)

పాక్ వైపు కన్నెత్తి చూస్తే గుడ్లు పీకేస్తాం.. ఆలయాల్లో గంటలు మోగవు : పాకిస్థాన్

ఈనెల 14వ తేదీన జరిగిన పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాలన్న పట్టుదలతో భారత్ ఉంది. దీంతో పాకిస్థాన్ తీవ్రమైన ఒత్తిడికి గురవుతోంది. అయితే, తమపై భారత్ యుద్ధానికి దిగితే తాము కూడా యుద్ధం చేసేందుకు సిద్ధమని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. దీంతో పాకిస్థాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ మరింతగా రెచ్చిపోచారు. పాక్ వైపు కన్నెత్తి చూస్తే గుడ్లు పీకేస్తామంటూ హెచ్చరించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, పుల్వామా దాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఎంతమాత్రం లేదన్నారు. 'మనసులో దుష్ట తలంపుతో పాకిస్థాన్ వైపు చూస్తే వాళ్ల గుడ్లు పీకేస్తాం. ఆ తర్వాత పక్షుల కిలకిలరావాలూ ఉండవు, ఆలయాల్లో గంటలూ మోగవు' అంటూ ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.