శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 10 ఆగస్టు 2017 (12:45 IST)

ఖతార్‌కు ఇక వీసా లేకుండా వెళ్ళొచ్చు తెలుసా?

సౌదీ అరేబియాతో పాటు ఏడు దేశాలు ఖతార్ దేశంలో సంబంధాలను తెగతెంపులు చేసుకున్న నేపథ్యంలో.. భారత్‌తో పాటు 80 దేశాలు ఖతార్‌కు వీసా లేకుండా రావొచ్చునని.. ఈ విధానం తక్షణమే అమల్లోకి వస్తుందని హోం శాఖ ప్రకటించి

సౌదీ అరేబియాతో పాటు ఏడు దేశాలు ఖతార్ దేశంలో సంబంధాలను తెగతెంపులు చేసుకున్న నేపథ్యంలో.. భారత్‌తో పాటు 80 దేశాలు ఖతార్‌కు వీసా లేకుండా రావొచ్చునని.. ఈ విధానం తక్షణమే అమల్లోకి వస్తుందని హోం శాఖ ప్రకటించింది. ఈ విధానం ప్రకారం, భారత్, అమెరికా, ఇంగ్లండ్, కెనడా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్  వంటి 80 దేశాలు వీసా లేకుండా ఖతార్‌కు వచ్చే అవకాశం ఉందని ఆ దేశ హోం శాఖాధికారులు వెల్లడించారు.
 
ఆరు నెలల పాటు వీసా లేని విధానం చెల్లుబాటు అవుతుందని ఖతార్ ప్రకటించింది. ఆరు నెలల పాటు పాస్ పోర్ట్ మరియు తిరుగు ప్రయాణం కోసం టిక్కెట్లు చేతిలో వుంటే చాలునని ఖతార్ పేర్కొంది. ఆ దేశ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా ఖతార్ ఈ ప్రకటన చేసినట్లు ఆ దేశ హోం శాఖ ఛైర్మన్ హాసన్ అల్ ఇబ్రహీం తెలిపారు. 
 
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఖతార్‌కు వచ్చే 80 దేశాలకు చెందిన పర్యాటకులు ఉచిత వీసా కోసం అర్హత పొందుతున్నారు. తమ సంస్కృతికి అద్దం పట్టే ప్రాంతాలను సందర్శించేందుకు పర్యాటకులను సాదరంగా స్వాగతిస్తున్నామని చెప్పారు.