శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 26 జులై 2014 (17:40 IST)

కోర్టులో నిద్రపోయిన జడ్జి: అటకెక్కిన చిన్నారి రేప్ కేస్!

చిన్నారిపై అత్యాచారం కేసు జరుగుతోంది.. జడ్జి నిద్ర పోవడంతో ఆ కేసు విచారణ కాస్తా అటకెక్కింది. ఈ ఉదయం బ్రిటన్‌లోని లోని మాంచెస్టర్ క్రౌన్ కోర్టులో చోటుచేసుకుంది. కోర్టులో రేప్ కేసు విచారణ జరుగుతోంది. పైగా అదో చిన్నారిపై అత్యాచారం కేసు.. వాదోపవాదాలు తీవ్రంగా సాగుతున్నాయి.
 
ఈ వాదనలను అత్యంత సావధానంగా వినాల్సిన జడ్జి ఫిలిప్ కాటన్ కాస్తా నిద్రపోతూ దర్శనమిచ్చాడు. తాము నిందితులను క్రాస్ ఎగ్జామిన్ చేస్తుండగా కాటన్ గారు నిద్రపోయారని న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. 
 
జడ్జి నిద్ర ఘటనతో రేప్ కేసు విచారణ కాస్తా అటకెక్కింది. ఈ కేసు విచారణను త్వరలోనే ప్రారంభిస్తామని క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ పేర్కొంది. ప్రస్తుతం కాటన్ మహాశయుడి నిద్ర విషయంపై దర్యాప్తు జరుగుతోంది.