Widgets Magazine

ఇజ్రాయేల్‌లో నరేంద్ర మోడీ.. పాకిస్థాన్ గుండెల్లో రైళ్లు...

బుధవారం, 5 జులై 2017 (09:41 IST)

Widgets Magazine
narendra modi

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇజ్రాయేల్ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనతో పాకిస్థాన్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఈ పర్యటన ద్వారా పాకిస్థాన్ సైన్యానికి తగిన రీతిలో చెక్ పెట్టేందుకే మోడీ వ్యూహం పన్నినట్టు తెలుస్తోంది. దీనిపై పాకిస్థాన్ పత్రికలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మోడీ దౌత్యపరంగా దూకుడు కనబరుస్తున్నారంటూ పాక్ మీడియా విస్తృత కథనాలను ప్రసారం చేస్తోంది. 
 
అంతేకాదు.. భారత్ దూకుడుకు కళ్లెం వేయకపోతే పాకిస్థాన్ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తోంది. దాదాపు అక్కడి టీవీ చానెళ్లన్నీ మోదీ ఇజ్రాయెల్ పర్యటనపై ఫోకస్ పెట్టగా.. ప్రత్యేకించి ఇంగ్లీష్, ఉర్దూ దినపత్రికలు సైతం మంగళవారం సంపాదకీయాల్లో ఈ అంశాన్నే ప్రస్తావించాయి.
 
ప్రముఖ దినపత్రిన డాన్... ‘‘ఇజ్రాయెల్‌ను సందర్శించనున్న తొలి భారత ప్రధాని మోదీ’’ అంటూ హెడ్‌లైన్‌తో వార్త ప్రచురించగా... ఎక్స్ ట్రిబ్యూన్ సైతం.. ‘‘ఇజ్రాయెల్‌లోని భారతీయులకు మోదీ పర్యటన ప్రత్యేకమైనది’’ అని పేర్కొంది. 
 
ఇదిలావుండగా, ఇజ్రాయిల్‌లో పర్యటించే తొలి భారత ప్రధాని నరేంద్ర మోడీ కావడం గమనార్హం. దీంతో ఆయనకు ఘనమైన స్వాగతం లభించింది. మోడీని ఆహ్వానించేందుకు ఆ దేశ ప్రధాని నెతన్యాహూ స్వయంగా ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ఇజ్రాయిల్‌కు వచ్చే అతిథుల్లో పోప్, అమెరికా అధ్యక్షుడికి మాత్రమే ప్రధాని స్వయంగా స్వాగతం పలుకుతారు. ఇపుడు అలాంట్ గౌరవం మోడీకి దక్కింది. 
 
మోదీకి స్వయంగా నెతన్యాహూ స్వాగతం పలికారు. ఆ తర్వాత కింగ్ డేవిడ్ హోటల్‌లో మోడీ బసచేస్తారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఇదే హోటల్‌లో గతంలో డొనాల్డ్ ట్రంప్ విడిది చేశారు. మోడీ పాల్గొనే అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొనాలని నెతన్యాహూ నిర్ణయించారు. అడుగడుగునా ఆయన వెంట ఉండి, వీలైనంత ఎక్కువ స్నేహబంధాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జీవితానికి శుభం పలికే స్వేచ్ఛ మనకుంది సరే. ఒకరి తర్వాత ఒకరు ఇలా పోతే ఎలా?

జీవితం సాగించే పరిస్థితులు కనుచూపుమేరలో కనపడనప్పుడు తన జీవితాన్ని తానే ముగించుకునే హక్కు ...

news

ఫేస్ బుక్ ప్రేమ.. కులాంతర వివాహం.. ఆత్మహత్య చేసుకుందామని.. ప్రేయసిపై డీజిల్ కుమ్మరించి?

ఫేస్ బుక్ ప్రేమతో ఓ యువతి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ప్రేమిస్తున్నానని పెళ్లి ...

news

అసహజ బంధం.. ఇద్దరు పిల్లలకు తల్లిని దూరం చేసింది... ఎలా?

అసహజబంధం ఓ కుటుంబంలో చిచ్చుపెట్టింది. ఫలితంగా రెండు నిండు ప్రాణాలు అర్థాంతరంగా తనువు ...

news

పని లేకున్నా అర్ధరాత్రి వరకూ మేల్కొనే ఉంటున్నారా.. అయితే మరణమే శరణం

నిద్రాదేవి నిను వరించె గదరా నిర్భాగ్య దామోదరా అని పద్యం ఉంది. ఇప్పుడు దానికి పూర్తి ...