శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , ఆదివారం, 9 జులై 2017 (23:38 IST)

అణు పరీక్షల నిర్వహణ సింగిల్‌గా సాధ్యం కాదు. ఉత్తర కొరియా ఎలా సాధించిందంటే

అణు పరీక్షలు నిర్వహించే సామర్ధ్యం అమెరికాతో ప్రారంభమయ్యాక రష్యాతో సహా అతి కొద్ది దేశాలు మాత్రమే ప్రపంచంలో ఆ సామర్థ్యాన్ని సంతరించుకున్నాయి. అమెరికన్ అణు శాస్త్రజ్ఞులే ప్రపంచ సర్వ నాశనాన్ని ఊహించి భయపడి సమతుల్యత తీసుకురావడానికి నాటి సోవియట్ రష్యాకు రహ

అణు పరీక్షలు నిర్వహించే సామర్ధ్యం అమెరికాతో ప్రారంభమయ్యాక రష్యాతో సహా అతి కొద్ది దేశాలు మాత్రమే ప్రపంచంలో ఆ సామర్థ్యాన్ని సంతరించుకున్నాయి. అమెరికన్ అణు శాస్త్రజ్ఞులే ప్రపంచ సర్వ నాశనాన్ని ఊహించి భయపడి సమతుల్యత తీసుకురావడానికి నాటి సోవియట్ రష్యాకు రహస్యంగా అణు పరిజ్ఞానం అందించారన్నది బహిరంగ రహస్యమే. ప్రపంచాన్ని ధ్వంసం చేయగల పరిజ్ఞానం ఇలా బట్టబయలైపోయాక అటు అమెరికా, ఇటు సోవియట్ రష్యా తమకు అత్యంత మిత్రులై న అతి కొద్ది దేశాలకు తమ వద్ద ఉన్న అణు పరిజ్ఞానాన్ని పంచిపెట్టాయన్నదీ తెలిసిన విషయమే. పాకిస్తాన్ వంటి అతి చిన్న దేశం కూడా అణు సామర్థ్యం సంతరించుకున్నదంటే భారత్‌కు పోటీగా అమెరికా అందించిన సహాయమే కారణమన్నది జగమెరిగిన సత్యమే.
 
ఇప్పుడు ఉత్తర కొరియా వంతు వచ్చింది. అమెరికానే గడగడలాడించే స్థాయిలో ఆ దేశం ఇప్పుడు బాలిస్టిక్ క్షిపణులనే సంధించే స్థాయికి చేరుకోవడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. అందరి అనుమానం ఉత్తర కొరియా మిత్రదేశం, పొరుగుదేశమైన చైనాపైకే తొలి నుంచి మళ్లింది కానీ అసలు కారణం ఇప్పుడే బయటపడుతోంది. సోవియట్ రష్యా శాస్త్రజ్ఞులు దశాబ్దాల క్రితం అందించిన పరిజ్ఞానం సాయంతోనే ఉత్తర కొరియా నేటికి ఖండాంతర క్షిపణులను ప్రయోగించే స్థాయికి చేరుకుందని వెల్లడయింది.
 
విషయాల్లోకి వస్తే...ఖండాతర క్షిపణి సామర్ధ్యం కోసం ఉత్తరకొరియా ఎంతగా పరితపించి పోయిందో అందరికీ తెలుసు. అమెరికాపై కాలు దువ్వుతూ త్వరలోనే ఖండాతర క్షిపణి సామర్ధ్యం సాధిస్తామని ఉత్తరకొరియా నియంత కిమ్‌ జోంగ్‌ పలుమార్లు స్పష్టం చేశారు. అదే ధ్యేయంతో ఈ నెల 4వ తేదీన జరిపిన ఖండాంతర క్షిపణి పరీక్షలో విజయం సాధించారు. దీంతో ఒక్కసారిగా అమెరికా షాక్‌కు గురైంది. అయితే, ఖండాంతర క్షిపణి సామర్ధ్యాన్ని ఉత్తరకొరియా సొంతగా సాధించలేదనే అనుమానం వ్యక్తమవుతోంది.
 
అమెరికా వినాశనం కోరి రష్యాయే ఆ టెక్నాలజీని ఉత్తరకొరియాకు రహస్యంగా అందించిందనే వార్తలు ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో సంచలనంగా మారాయి. ఇందుకు అమెరికాకు చెందిన ఓ ఆయుధాల నిపుణుడు మిచెల్‌ ఇల్లేమాన్‌ చేసిన వ్యాఖ్యలే కారణం. ఉత్తరకొరియా పరీక్షించిన క్షిపణి ఇల్లేమాన్ అది రష్యా క్షిపణి టెక్నాలజీని పోలి ఉందని అంటున్నారు. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో సోవియెట్ క్షిపణులను తాను పరిశీలించానని, చాలా కాలం తర్వాత అదే విధమైన క్షిపణిని ఉత్తరకొరియా ప్రయోగించిందని ఆయన అన్నారు. దీంతో రష్యాకు చెందిన శాస్త్రవేత్తలే ఈ మిసైల్ తయారీకి సహకరించారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
 
ఇందుకు ఉదాహరణగా ఓ ఘటనను ప్రస్తావిస్తూ.. 1962లో ఉత్తరకొరియా వెళ్లేందుకు రష్యాకు చెందిన 60 మంది శాస్త్రవేత్తలు ప్రయత్నించారని, డబ్బులు తీసుకుని మిసైల్ టెక్నాలజీని ఉత్తరకొరియాకు అందించాలని వారు భావించినట్లు చెప్పారు. సరిహద్దు దాటేందుకు కుటుంబాలతో సహా సిద్ధమవుతుండగా వారిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయని తెలిపారు. అనంతరం రష్యాకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు ఉత్తరకొరియాకు ఈ టెక్నాలజీని అందించడంతో ఈ క్షిపణులు సాధ్యమయ్యాయని ఆయన పేర్కొన్నారు.  
 
చిన్న దేశాలు అతి సులభంగా సేకరిస్తున్న అణు పరిజ్ఞానం ఉగ్రవాదుల నెట్‌వర్క్‌కు ఎందుకు చేరలేదనేది ప్రశ్నే. కానీ ఒక అణుపరీక్ష నిర్వహించడానికి ఒక అణుబాంబును తయారు చేయడానికి కొన్ని వేల సాంకేతిక వ్యవస్థలను ఏకకాలంలో అనుసంధానించవలసి ఉన్నందునే ఉగ్రవాద సంస్థలకు అణు పరిజ్ఞానం అందడం లేదు. ఒకవేళ అందినా దాన్ని అమలు చేయగల బృహత వ్యవస్థల నిర్మాణం ప్రపంచంలో ఏ దేశ ఉగ్రవాద సంస్థకూ ఇప్పటివరకైతే లేదు.