మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 17 ఆగస్టు 2017 (17:58 IST)

అరుదైన అవకాశం వచ్చింది.. ఆక్స్‌ఫర్డ్ చదువుకోనున్నా: మలాలా ట్వీట్

తాలిబన్ దాడికి తర్వాత బ్రిటన్‌లో వుంటున్న పాకిస్థాన్ గర్ల్ మలాలా ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీలో చదువుకోనున్నట్లు స్వయంగా ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. ఇందులో భాగంగా ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో తనకు సీట

పాకిస్థాన్ మాజీ ప్ర‌ధాని బెన‌జీర్ భుట్టో, మ‌య‌న్మార్ నాయ‌కురాలు ఆంగ్ సాన్ సూకీ, బ్రిట‌న్ మాజీ ప్ర‌ధాని డేవిడ్ కేమెరూన్‌లు కూడా ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీలో చదువుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలికల విద్యపై పోరాటం చేసి.. తాలిబన్ చేతిలో కాల్పులకు గురై.. ప్రాణాల మీదకు తెచ్చుకుని.. ఆపై ప్రాణాపాయ స్థితి నుంచి కోలుకున్న పాకిస్థాన్ ధీర బాలిక, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్ జాయ్ ఆక్స్ ఫర్డ్ వర్శిటీలో చదివే అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. 
 
తాలిబన్ దాడికి తర్వాత  బ్రిటన్‌లో వుంటున్న పాకిస్థాన్ గర్ల్ మలాలా ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీలో చదువుకోనున్నట్లు స్వయంగా ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. ఇందులో భాగంగా ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో తనకు సీటు కేటాయించినట్లు.. సదరు ఆక్స్‌ఫర్డ్ వారు పంపిన మెసేజ్‌ను షేర్ చేశారు. ఫిలాస‌ఫీ, రాజ‌కీయాలు, ఆర్థిక శాస్త్రాల‌ను ఆక్స్‌ఫర్డ్ వర్శిటీలో అభ్యసించనున్నానని.. ఎప్పుడెప్పుడు ఆక్స్‌ఫర్డ్‌కు వెళ్తానా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు.