శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (12:47 IST)

సమైక్యవాదానికే స్కాట్లాండ్ ప్రజల ఓటు, 28 రాష్ట్రాలు అనుకూలం.. 4 వ్యతిరేకం!

స్కాట్లాండ్ ప్రజలు సమైక్యవాదానికే ఓటు వేశారు. యునైటెడ్ కింగ్‌డమ్ నుంచి వేరు పడే అంశంపై ఆ దేశంలో నిర్వహించిన అభిప్రాయ సేకరణలో 55 శాతం మంది ప్రజలు విభజనకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. కౌంటింగ్‌లో యునైటెడ్ కింగ్‌డమ్‌లో కొనసాగేందుకే స్కాట్లాండ్ ప్రజల్లో అత్యధికులు ఓటు వేశారు. 
 
సమైక్యవాదానికి అనుకూలంగా 55 శాతం ఓటు వేస్తే, వ్యతిరేకంగా 45 శాతం మంది ఓటు వేశారు. దీంతో, 300 ఏళ్ల బ్రిటన్-స్కాట్లాండ్ అనుబంధం యథావిధిగా ఇకపై కూడా కొనసాగనుంది. మొత్తం 43 లక్షల మంది ప్రజలు ఓటింగులో పాల్గొన్నారు. 
 
1707 నుంచి గ్రేట్ బ్రిటన్ పాలనలో స్కాట్లాండ్ ఉంది. స్కాట్లాండులో మొత్తం 32 రాష్ట్రాలు ఉండగా ఇప్పటి వరకు 28 రాష్ట్రాలు విభజనను వ్యతిరేకించాయి. కేవలం నాలుగు రాష్ట్రాలు మాత్రమే విభజనకు విభజనకు మద్దతును ఇచ్చాయి. ఈ తీర్పు విభజనవాదులకు గట్టి ఎదురు దెబ్బవంటిది.