శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 25 మే 2016 (17:50 IST)

సియోల్‌లో దారుణం.. ఉన్మాది చేతిలో అకారణంగా మహిళ హత్య.. కత్తితో పొడిచి?!

మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్న నేపథ్యంలో అకారణంగా ఓ ఉన్మాది మహిళను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన దక్షిణ కొరియా రాజధాని నగరం సియోల్‌లో చోటుచేసుకుంది. సియోల్‌లోని సియోచో ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లోని బాత్‌రూమ్‌లో ఇటీవల ఓ యువతి దారుణంగా హత్యకు గురైనట్లు పోలీసులకు ఆమె బాయ్‌ఫ్రెండ్ ద్వారా ఫిర్యాదు అందింది. ఇక్కడే కొద్ది రోజుల క్రితం లిఫ్టులో వెళ్తున్న ఓ మహిళను అకారణంగానే ఓ యువకుడు చితకబాదిన ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. 
 
తాజాగా అదే అపార్ట్‌మెంట్‌లో మహిళ హత్యకావడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై పోలీసులు జరిపిన దర్యాప్తులో దోషి దొరికిపోయాడు. సీసీటీవీ ఫోటోల సాయంతో హత్య చేసింది.. ఆ అపార్ట్‌మెంట్లో పనిచేసే కిమ్‌గా గుర్తించారు. ఈ విచారణలో అతడు మహిళఆ ద్వేషి అని.. ఎలాంటి కారణం లేకుండానే ఆమె మహిళ అయినందుకే హత్య చేసినట్లు తెలిపాడు. పక్కా ప్లాన్ ప్రకారం ఆ మహిళా ఫ్లాట్‌లోకి కత్తితో ప్రవేశించిన కిమ్.. ఆమెను విచక్షణారహితంగా కత్తితో పొడిచి చంపేశాడని పోలీసులు వెల్లడించారు.