శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సందీప్
Last Updated : గురువారం, 14 మార్చి 2019 (15:10 IST)

ఆమెను చూస్తే మగాడిలా ఉంది.. పైగా మూడ్ రాదు.. రేప్ ఎలా చేస్తాం!!

తనపై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారని ఓ యువతి నిండు కోర్టులో సిగ్గు విడిచి చెప్పినా కోర్టు నమ్మలేదు. పైగా, ఆమె మగాడిలా ఉంది. ఆమెను ఎలా రేప్ చేస్తారంటూ ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఎదురు ప్రశ్న వేసింది. దీంతో బాధితురాలు ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో మిన్నకుండిపోయింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, అంకోనాలో 2015లో ఓ యువతి(22)ని ఇద్దరు వ్యక్తులు మత్తుమందిచ్చి అత్యాచారం జరిపారు. అఘాయిత్యానికి పాల్పడిన వారిపై మహిళ కోర్టులో కేసు వేసింది. 2016లో వారికి శిక్ష పడింది. కానీ నిందితులు తమకు న్యాయం చేయాలంటూ 2017లో పై కోర్టును ఆశ్రయించారు. 
 
ముగ్గురు మహిళా జడ్జీలతో కూడిన ధర్మాసనం వారిని విచారించింది. మీరు నిజంగా రేప్ చేసారా అని జడ్జీలు ప్రశ్నించారు. ఆమె చూస్తే మగాడిలా ఉంది, అందవిహీనంగా ఉంది ఆమెను చూస్తే మాకు మూడ్ ఎలా వస్తుందని చెప్పారు. ధర్మాసనం కూడా వారికి మద్దతు ఇచ్చింది. ఆమె రూపాన్ని పరిగణనలోకి తీసుకుని వారిని విడుదల చేసింది. దాంతో మహిళ కూడా తనకు న్యాయం చేయాలంటూ మళ్లీ సుప్రీంలో కేసు దాఖలు చేసింది.