ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 1 మార్చి 2019 (22:43 IST)

ద్యావుడా.. సబ్బే ఆమె భోజనం.. ఎక్కడ..?

నువ్వంటే నాకిష్టిం.. సబ్బు తినడమంటే నాకిష్టం. సబ్బే నా బువ్వరా. తీర్చే నా ఆకలి. సబ్బే బలం.. సబ్బే జగం.. సబ్బంటే నాకిష్టం అంటూ ఒక పాట పాడుకుంటోంది అమ్మాయి. ఇండోనేషియాకు చెందిన కొసిక్ ఆసిఫా అనే యువతి. సబ్బు కనిపిస్తే చాలు రుచి చూసేంతవరకు ఓపిక పట్టదు. సబ్బు తినేసి ఏ సబ్బు ఎటువంటిదో రేటింగ్ కూడా ఇస్తుందట.
 
కడుపుతో ఉంటే ఎవరికైనా పులుపు తినాలనిపిస్తుంది, రెండేళ్ళ కింద కడుపుతో ఉన్నప్పుడు ఆసిఫా సబ్బు తినాలనిపించిందట. దీంతో అప్పటి నుంచి సబ్బులు తినడం మొదలుపెట్టిందట. అలా అంటుకుంది అంతే కాదు సబ్బులను తింటూ వీడియోలను యు ట్యూబ్‌లో అప్‌లోడ్ చేసేస్తుందట. దీంతో కొంతమంది సబ్బులను యజమానులు తన సబ్బులను ఆసిఫా దగ్గరకు తీసుకొచ్చి దాన్ని తినిపించి రేటింగ్ ఇమ్మని బ్రతిమాలుకుంటున్నారట.